ఉదయ్ కిరణ్ నుంచి తారకరత్న వరకు ఆ కారణంతోనే చనిపోతున్నారా.. యువ హీరోలకి ఏమైంది..!

చిత్ర పరిశ్రమంలో వరుసగా అనుకోని విషాదాలు జరుగుతున్నాయి. ఎంతోమంది యువ హీరోలు కేవలం 40 సంవత్సరాలు కూడా నిండకుండానే అతి చిన్న వయసులోనే మరణిస్తున్నారు. ఇక మరి కొంతమంది అవకాశాలు రాక మరణిస్తుంటే, మరికొందరు డిప్రెషన్ లోకి వెళ్లి మరణిస్తున్నారు. ఇంకొంతమంది అనారోగ్య కారణాల వల్ల మరణిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న ఈ మరణాలు చిత్ర పరిశ్రమని కుదిపేస్తున్నాయి. అయితే ఇప్పుడు అతి చిన్న వయసులోనే మరణించిన హీరోలు ఎవరు ఇప్పుడు చూద్దాం.

1. ఉదయ్ కిరణ్: టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వడంతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుని వరుస విజయాలతో దూసుకుపోయాడు. లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకుని మనసంతా నువ్వే, నువ్వు నేను సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. కానీ ఆ తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్ కు లోనై కేవలం 33 సంవత్సరాలకే మరణించాడు.

2. తారకరత్న: నందమూరి కుటుంబం నుంచి వచ్చిన మూడోతరం హీరోల్లో తారకరత్న కూడా ఒకరు. తన ఎంట్రీ తోనే చిత్ర పరిశ్రమంలో ఎవరు చెరపలేని రికార్డును సృష్టించారు. అయితే ఆ తర్వాత పరిశ్రమంలో హీరోగా సక్సెస్ అవకపోవడంతో కొంతకాలం చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటూ వచ్చాడు.
గత కొన్ని రోజుల ముందు రాజకీయాల మీద ఉన్న ఆసక్తితో రాజకీయాల్లోకి వెళ్లి గత నెల నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో పాల్గొని ఒక్కసారిగా గుండెపోటుకు గురై 23రోజులు మృత్యువుతో పోరాడీ చివరికి గత శనివారం నాడు తుది శ్వాస విడిచాడు. తారకరత్న కూడా కేవలం 39 సంవత్సరాల వయస్సులోనే మరణించాడు.

3. పునీత్ రాజ్ కుమార్: కన్నడ చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న పునీత్ రాజ్ కుమార్ కూడా కేవలం 46 సంవత్సరాలకే జిమ్‌లో వర్కౌట్ చేస్తూ హార్ట్ ఎటాక్ గురై మరణించాడు. ఈయన మరణించడంతో భారతదేశ చిత్ర పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా అవాక్కయింది.

Sushant Singh Rajput was murdered': Autopsy staff makes shocking claim

4.సుశాంత్ సింగ్ రాజ్ పుత్: తెలుగు చిత్ర పరిశ్రమంలో ఉదయ్ కిరణ్ లా బాలీవుడ్‌లో సుశాంత్ కూడా తాను చేసిన అతి తక్కువ సినిమాలతోనే మంచి ఇమేజ్‌ను తెచ్చుకున్నాడు. కానీ ఆయన కేవలం 34 సంవత్సరాల వయసులోనే ఆత్మహత్య చేసుకుని మరణించాడు.

Yasho Sagar

5. యశో సాగర్ : ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో ఒక్కసారిగా స్టార్డం తెచ్చుకున్నాడు యశోసాగర్. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈయన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈయన కూడా చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లడం గమనార్హం.

Share post:

Latest