పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఇప్పుడు ఏం చేస్తున్నారంటే..!

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చిరంజీవి తమ్ముడు అనే మార్క్ ని దాటి చాలా కాలమైంది. టాలీవుడ్ లోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరిగా ఉన్నారు. తన సినిమాలకు హిట్ ప్లాప్‌ల‌తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు అటు రాజకీయాలు చేస్తూ ఫుల్ బిజీగా కొనసాగుతున్నాడు.

రాజకీయాల్లో పవన్ ప్రధానంగా ఎదుర్కొనే విమర్శ ఆయన పెళ్లిళ్లు. పవన్ 2014 జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ విమర్శ ఎదురవుతూనే ఉంది. ఆయన పలు సందర్భాల్లో ఈ విమర్శలకు కౌంటర్లు ఇస్తూ వచ్చారు. ఈ సందర్భంలోనే రీసెంట్ గా వచ్చిన బాలకృష్ణ అన్‌ స్టాపబుల్ షో తో ఆ విమర్శలకు మరోసారి అదిరిపోయి కౌంటర్ ఇచ్చాడు పవన్.

పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్న వారిలో ఆమె రెండో భార్య రేణుదేశాయ్ పవన్ కి దూరం గా ఉంటున్న తరచూ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఈమె రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. పవన్ మూడో భార్య ‘అన్నలెజినోవా’ ఆయనతో కలిసి ఉన్న సంగతి తెలిసిందే. అయితే పవన్ మొదటి పెళ్లి చేసుకున్న భార్య ఎవరు.. ఆమె పేరు ఏంటి..? ఆమె ఎలా ఉన్నారు..? ఎక్కడ ఉన్నారు అనే విషయాలు పెద్దగా ఎవరికి తెలియవు. ఇప్పుడు ఆమె గురించి తెలుసుకుందాం.

పవన్ కళ్యాణ్ తన మొదటి పెళ్లిని 1997లో నందిని అనే అమ్మాయిని చేసుకున్నాడు. అయితే పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఆమెకు భరణం కింద రూ.5 కోట్లు దాకా డబ్బులు ఇచ్చారని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె ఇప్పుడు ఏం చేస్తుంది.. అనేది ఇప్పుడు చూద్దాం. పవన్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె తన పేరుని నందిని నుంచి జాహ్నవిగా మార్చుకుంది. అ తర్వాత 2010లో కృష్ణారెడ్డి అనే ఒక డాక్టర్ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అమెరికా వెళ్లి అక్కడ సెటిల్‌ అయింది. ప్రస్తుతం ఈమె తన భర్త పిల్లలతో ఆనందంగా ఉంటుంది.

Share post:

Latest