వెంకటేష్ తెలుగు తెరకు పరిచయం చేసిన స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..!

దగ్గుబాటి రామానాయుడు కొడుకుగా వెంకటేష్ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఫ్యామిలీ సినిమాలతో టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆయనను వెంకటేష్ కన్నా విక్టరీ వెంకటేష్ అంటేనే మనకు బాగా పరిచయం. వెంకటేష్ 1986లో కలియుగ పాండవులు సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. కళాతపస్వికే విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన స్వర్ణకమలం సినిమాల్లో నటించి ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు.

Victory Venkatesh completes 34 years in Tollywood | Telugu Movie News -  Times of India

ఇక అదే సమయంలో వారసుడొచ్చాడు సినిమాతో స్టార్ హీరోగా అవతరించాడు. ఆ తర్వాత కొన్ని అపజయాలు వచ్చినా బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన బొబ్బిలి రాజా సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్నాడు. వెంకటేష్ తన సినిమాలతో ఎంతోమంది హీరోయిన్లను టాలీవుడ్‌కు పరిచయం చేశారు. ఇప్పుడు వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

 ‘కలియుగ పాండవులు’ సినిమాతో హీరోయిన్ కుష్బూను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన వెంకటేష్. (Twitter/Photo)

ఖుshbu: వెంకటేష్ హీరోగా వచ్చిన కలియుగ పాండవులు సినిమా ద్వారా పరిచయం అయింది. వెంకటేష్ కూడా ఈ సినిమా ద్వారానే పరిచయం అయ్యాడు. ఈ సినిమా 1986 లో కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదల అయ్యి ఘన విజయం సాధించింది. వెంకటేష్ కి కొత్త కథానాయకుడిగా నంది అవార్డ్ ని తెచ్చిపెట్టింది.

Venkatesh & Gauthami Spicy Love Scene || Srinivasa Kalyanam Movie || Bhanu  Priya, Mohan Babu - YouTube
గౌతమి: శ్రీనివాస కళ్యాణం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది గౌతమి. వెంకటేష్ సరసన నటించిన గౌతమి మొదటిసారిగా ఈ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. శ్రీనివాస కళ్యాణం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ అయింది.

 ‘బొబ్బిలి రాజా’ సినిమాతో దివ్యభారతి ని ఇంట్రడ్యూస్ చేసారు. (Twitter/Photo)

దివ్య భారతి: ఉత్తరాది నుండి దక్షిణాది పరిశ్రమకు వచ్చి మంచి పేరు తెచ్చుకుంది దివ్య భారతి. రామానాయుడు తమ సంస్థ నిర్మించిన బొబ్బిలి రాజా సినిమా ద్వారా దివ్యభారతిని పరిచయం చేసారు. ఈ సినిమా వెంకటేష్, దివ్యభారతి హీరో హీరోయిన్స్ గా బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమా ఘన విజయం సాధించి వెంకటేష్ కి మాస్ ఇమేజ్ ని సంపాదించి పెట్టింది .

 కూలీ నెం. 1 సినిమాతో టబును హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం చేసాడు వెంకటేష్. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌లో ఈ సినిమా తెరకెక్కింది. (Youutube/Credit)

టబు: 1987 లో కూలీ నెంబర్ 1 సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. వెంకటేష్ సరసన నటించిన టబు ఈ సినిమాతో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. శిల్ప శెట్టి: సాహస వీరుడు సాగర కన్య సినిమాతో వెంకేటేష్ తో జోడి కట్టి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా 1996 లో విడుదల అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ సినిమాగా నిలిచింది.

 ‘ధర్మచక్రం’ సినిమాతో హీరోయిన్ ప్రేమ. ఈమె తెలుగుతో పాటు కన్నడలో టాప్ హీరోయిన్‌గా రాణించింది.  (Twitter/Photo)

ప్రేమ: సురేష్ ప్రొడక్షన్స్ బేనర్ పై రామానాయుడు నిర్మించిన ధర్మ చక్రం సినిమాలో వెంకటేష్ తో నటించిన ప్రేమకు ఇదే తోలి సినిమా. ఈ సినిమా వెంకటేష్ కి నంది అవార్డు,ఫిలిం ఫేర్ అవార్డు లను తెచ్చిపెట్టింది.

 ‘ప్రేమించుకుందాం రా’ సినిమాతో అంజలా ఝవేరి. ఈమె కొన్నాళ్లు తెలుగులో టాప్ హీరోయిన్‌గా రాణించింది.  (Twitter/Photo)

అంజలా జవేరి: వెంకటేష్ తో ప్రేమించుకుందాం రా సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది అంజలా జవేరి. రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది.

 ‘ప్రేమంటే ఇదేరా’ సినిమాతో ప్రీతి జింతా. ఈమె  ఆ తర్వాత తెలుగులో మహేష్ బాబు ఫస్ట్ మూవీ ‘రాజకుమారుడు’ సినిమాలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో సెటిలైంది.  (Twitter/Photo)

ప్రీతి జింతా: ప్రేమంటే ఇదేరా సినిమాతో రామానాయుడు పరిచయం చేసాడు. ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటించాడు. 1998 లో వచ్చిన ఈ సినిమా హిట్ అయ్యింది.

 ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాతో ఆర్తి అగర్వాల్ పరిచయం . ఆ తర్వాత ఈమె తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్‌గా సత్తా చూపెట్టింది. (Twitter/Photo)

ఆర్తి అగర్వాల్: సురేష్ బాబు నిర్మించిన వెంకటేష్ హీరోగా నువ్వు నాకు నచ్చావ్ సినిమా ద్వారా సినీ రంగానికి పరిచయం అయింది. 2001 లో వచ్చిన ఈ సినిమా ఆర్తి అగర్వాల్ కి మంచి పేరు తెచ్చిపెట్టి ఎన్నో అవకాశాలను తెచ్చిపెట్టింది.

 ‘మల్లీశ్వరి’ సినిమాతో కత్రినా కైఫ్ పరిచయం. బాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతూనే.. రీసెంట్‌గా తన సహ నటుడు విక్కీ కౌశల్‌ను పెళ్లాడింది. (Twitter/Photo)

కత్రినా కైఫ్: మల్లీశ్వరి సినిమాలో వెంకటేష్ తో నటించి మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయం అయింది. 2004 లో ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్ బేనర్ లో వచ్చింది.

Share post:

Latest