సిల్క్ స్మిత సగం తిన్న యాపిల్‌తో అలాంటి పని చేశారా..ఏం మనుషులు రా బాబు..!

కైపెక్కించే కళ్ళు ఆమె సొంతం.. కుర్రాళ్ళ హృదయాలను ఆకర్షించే అయస్కాంతం ఆమె. 80 వ దశకంలో దక్షిణాది చిత్ర పరిశ్రమను ఉపేసినన ఐటమ్ బాంబ్ సిల్క్ స్మిత. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తాలూకా దెందులూరు మండలం కొవ్వలికి చెందిన విజయలక్ష్మి అనే అమ్మాయి.. సిల్క్ స్మితగా పేరు సంపాదించుకొని వెండి తెరపై తన అందాలను ఆరబోసి కుర్రకారును కైపెక్కించింది.

Silk Smitha's Thara to stun the silver screen - CINEMA - CINE NEWS | Kerala  Kaumudi Online

ఆమె సినిమాలో నటించడం కోసం సినిమా మొదలు పెట్టకుండానే ఆమె డేట్స్ తీసుకున్న తర్వాతే హిరోను కన్ఫర్మ్ చేసుకుని సినిమా మొదలు పెట్టేవారు. నటన అందంతో పాటు తన డ్యాన్స్‌లతో కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగించింది సిల్క్ స్మితగా. ఆమె ఎన్నో సినిమాలలో ఐట‌మ్ సాంగ్స్ లో నటించింది వాటిని ఇప్పటికీ కూడా మనం వింటూనే ఉన్నాం.

15 Rare Pics: Unforgettable moments of Silk Smitha the lost spring of  glamour: BizGlob

అయితే 1996 సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత జీవితం ఎవరు ఊహించిన విధంగా అర్దాంతరంగా ముగిసిపోయింది. ఆమె చేసుకున్న ఆత్మహత్య ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. ఆమె చావు గురించి ఇప్పటికీ ఎన్నో రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి అసలు నిజం ఏమిటో ఆ దేవుడికి తెలియాలి. ఈ సందర్భంలోనే సిల్క్ స్మిత విషయంలో తమిళ అభిమానులు తీరు మాత్రం కొంత విచిత్రంగా ఉండేది.

Dhansh heroine act in silk smitha biography The dirty pictures part 2 –  தமிழ் News - time.news - Time News

ఆమె తమిళనాడులో ఏదైనా షూటింగ్ సెట్ లోకి వచ్చి ఉంటే అక్కడ వాళ్లు ఒక కిల్లి తెచ్చి ఆమెను కొరికి ఇమ్మని తెగ బ్రతిమాలుకునేవారు. 1984లో ఓ సినిమా షూటింగ్ బ్రేక్ లో సిల్క్ యాపిల్‌ను తింటూ ఉండగా డైరెక్టర్ షాట్ రెడీ అని పిలిచారట.. సగం కొరికిన యాపిల్‌ను అక్కడ పెట్టేసి వెళ్లిపోయిందట. ఇక తర్వాత యాపిల్‌ను ఆమె మేకప్ మ్యాన్ అక్కడికక్కడే వేలం వేస్తే ఆ షూటింగ్ సెట్లో ఉన్న వాళ్ళు పోటీపడి మరి రూ.26 వేలుకు కొనుక్కున్నారట. అది సిల్క్ అంటే.

ఆమె అందానికి, ఆమె బాడీకి ఎంత క్రేజ్ ఉంది.. కానీ ఆమె చివ‌రికి చనిపోయి.. ఆస్పత్రిలో నిర్జీవంగా ఉన్నప్పుడు… ఓ సాధారణ శవంలా స్ట్రెచర్‌పై పడుకోబెట్టారట. అప్పుడు మ‌రో నటి అనురాధ అక్కడికి వెళ్లగా.. సిల్క్‌ డెడ్‌బాడీపై ఈగలు వాలడం చూసి.. దు:ఖం ఆగలేదట. రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నటి అనురాధ ఈ విషయాలను గుర్తు చేసుకుంది.