ఆ ఒక్క‌ తప్పే తారకరత్న మరణానికి కారణమైందా…!

గత 23 రోజుల నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్న నందమూరి తారకరత్న గత రాత్రి 10 గంటల సమయంలో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. గత నెల 27న నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న ఆ సమయంలోనే గుండెపోటుకు గురవడంతో అక్కడికి అక్కడే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.. వెంటనే మెరుగైన వైద్యం కోసం అక్కడ ఉన్న స్థానిక హాస్పిటల్‌కు తరలించడం జరిగింది.

ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్‌కు తరలించారు. ఆ సమయం నుంచి ప్రత్యేక వైద్యుల చేత ఆయనకు వైద్యం అందించారు. కాని అప్పటి నుంచి తారకరత్న ఆరోగ్యం క్రిటికల్ గానే ఉంది. హాస్పటల్‌లో జాయిన్ అయిన తొలి రోజు నుంచి చివరి శ్వాస విడిచే వరకు తారకరత్న ఆరోగ్య పరిస్థితుల్లో ఎలాంటి మెరుగు కనిపించకపోవడంతో అక్కడి వైద్యులు ఎంతో ప్రయత్నించారు.

Nandamuri Tarakaratna: అసలు ఆరోజు ఏం జరిగింది.? కెరీర్‌ అద్భుతంగా  ఉందనుకునేలోగా ఇలా.. | Nandamuri taraka ratna death.. do you know what  happened that day | TV9 Telugu

అంతేకాకుండా ఆయన ఆరోగ్యం మెరుగు పడటం కోసం విదేశాల నుంచి కూడా ఎందరో స్పెషలిస్ట్‌లను. తీసుకువచ్చారు. అయినా కూడా తారకరత్న ఆరోగ్యంలో ఎలాంటి మెరుగు కనిపించలేదు. దీంతో శనివారం రాత్రి తారకరత్న మరణించడంతో ఇటు అభిమానులు ఆయన కుటుంబ సభ్యుల్లో ఒక్కసారిగా శోకసముద్రంలో మునిగిపోయారు. తారకరత్న లేడు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇకపోతే గత 23 రోజులపాటు వైద్యులు అహర్నిశలు వారి శాయశక్తులా ప్రయత్నించినా కూడా తారకరత్నను బతికించలేకపోవడానికి కారణం ఆయనకు మొదటి రోజు అందించిన వైద్యం కారణమనే సందేహాలు కూడా వస్తున్నాయి. సాధారణంగా ఒక మనిషికి హార్ట్ ఎటాక్ వచ్చిన ఆ వ్యక్తికి సిపిఆర్ అనేది నిమిషాల్లో చేయాలి.. కానీ తారకరత్న విషయంలో సిపిఆర్ చేయడానికి దాదాపు 45 నిమిషాల సమయం ఆలస్యం చేశారు.

సిపిఆర్ అందించాల్సిన టైమ్‌ లో కూడా లేటుగా చేయడం వలనే తారకరత్న హార్ట్ హోల్స్ లో తీవ్రంగా బ్లడ్ బ్లాక్ అయిపోయి బ్రెయిన్ డెడ్ అవ్వటం వలనే తారకరత్న పరిస్థితి ఇంత విషమంగా మారింది. ఒకవేళ సరైన సమయంలో సీపీఆర్ చేసి ఉంటే తారకరత్న పరిస్థితి ముందు నుండే ఇంత సీరియస్ గా ఉండేది కాదేమో .. మెరుగైన వైద్యం అందించేందుకు డాక్టర్స్ కి మరింత ఎక్కువ అవకాశాలు ఉండేవేమో అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా 40 సంవత్సరాల వయసులోనే ఒక నందమూరి వారసుడిని కోల్పోవడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.