రజనీతో విభేదాల వల్లే.. ధనుష్ ఆ పని చేశారా..?

కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన ధనుష్ గత కొద్దిరోజుల క్రితం హిందూ సాంప్రదాయాల ప్రకారం తన కొత్త ఇంట్లోకి అడుగు పెట్టారు. ఇలా ఏకంగా ఈ ఇంటి కోసం రూ .150 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని హంగులతో ఆధ్యాత్మిక టెక్నాలజీతో ధనుష్ ఇంటిని నిర్మించడం జరిగింది. అయితే ధనుష్ నిర్మించిన ఈ ఇల్లు తన డ్రీమ్ హౌస్ గా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఇంటిని మాత్రం రజనీకాంత్ తో ఉన్నటువంటి వ్యక్తిగత విభేదాల కారణంగానే నిర్మించినట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Aishwaryaa Rajinikanth On Separation With Dhanush: We Need To Deal With  Whatever Comes Our Way
గతంలో రజనీకాంత్ పోయిస్ గార్డెన్లో ఉన్న ఇంటిలో ధనుష్ తల్లిదండ్రులకు పెద్ద ఎత్తున అవమానం జరిగిందని అయితే తన తల్లిదండ్రులకు జరిగిన అవమానానికి బదులుగా ఈయన అలాంటి గార్డెను నిర్మించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలపై తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ స్పందిస్తూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. రజనీకాంత్ పై ఉన్న దేశం తోనే ధనుష్ ఇంటిని నిర్మించారనే వార్తలు ఏమాత్రం నిజం లేదని తెలియజేశారు. వాస్తవానికి ధనుష్, భార్య ఐశ్వర్య పిల్లలతో కలిసి ఇంటిని నివసించడం కోసమే నిర్మించాలని తెలియజేశారు.

Dhanush New House: Dhanush buys new luxurious house for his parents, see  pics here - The Economic Times

అయితే ఈ ఇంటి నిర్మాణ భాగంగా భూమి పూజ కార్యక్రమంలో ఐశ్వర్య, ధనుష్ ఇద్దరు పాల్గొనడం జరిగింది. ఇక ఇంటి నిర్మాణం పూర్తి కాకుండా అని ఐశ్వర్య ధనుష్ వ్యక్తిగత కారణాలవల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడంతో ధనుష్ ఇంటి నిర్మాణాన్ని ఆపకుండా పూర్తి చేశారు. ఇక తాను ఐశ్వర్యాలతో విడిపోవడంతో ఇంటిని తాను నివసించలేక తన తల్లిదండ్రులకు బహుమతిగా ఇచ్చారని అంతకుమించి ఏమీ లేదని తెలిపారు ఆ జర్నలిస్ట్.

Share post:

Latest