ధ‌నుష్ `సార్` అరుదైన ఘ‌న‌త‌.. రాజ‌మౌళి సినిమాల‌కు కూడా ద‌క్క‌లేదు!

తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగులో నేరుగా చేసిన తొలి చిత్రం `సార్`. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టించింది. సాయికుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని, తనికెళ్లభరణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మించారు.

నేడు తెలుగులో ‘సార్‌’, తమిళంలో ‘వాతి’ పేర్లతో అట్ట‌హాసంగా ఈ సినిమా విడుద‌లైంది. అంద‌రికి అందుబాటులో ఉండాల్సిన విద్యా నేడు ఎలా వ్యాపారంగా మారిపోయింది? అధిక ఫీజుల కార‌ణంగా దిగువ‌, మ‌ధ్య త‌ర‌గ‌తి పిల్ల‌లు చ‌దువుకు ఏ విధంగా దూర‌మ‌వుతోన్నార‌నే పాయింట్‌తో సార్ సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమాకు అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూ వ‌స్తున్నాయి. ముఖ్యంగా సెకండాఫ్ అద్భుతంగా ఉందంటూ ప్రేక్ష‌కులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఇక‌పోతే ఈ సినిమాకు ఓ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి విడుదల ముందు రోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ భారీ రేంజ్ లో ప‌డ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 35 కి పైగా పడ్డాయి. ఇది ప్రీమియర్ షోస్ లోనే ఆల్ టైం రికార్డు గా చెప్పుకోవచ్చు. ప్రీమియర్ షోస్ నుండే దాదాపుగా 50 లక్షల గ్రాస్ ని వ‌సూల్ చేసింద‌ని అంటున్నారు. హైదరాబాద్ లో అయితే ఈ సినిమాకి 15 కి పైగా ప్రీమియర్ షోస్ పడగా, అన్నీ షోస్ హౌస్ ఫుల్ అవ్వ‌డం విశేషం. జంట నగరాలలో ఇప్పటి వరకు ఇన్ని షోస్ స్టార్ హీరోలకు కూడా పడలేదు. ఆఖ‌రికి రాజ‌మౌళి సినిమాల్లో ఒక్క బాహుబ‌లి 2 మినిహా మ‌రే సినిమాకు కూడా ఈ ఘ‌న‌త ద‌క్క‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

 

 

 

Share post:

Latest