ధనుష్ ‘సార్’ : మన తెలుగు హీరోలు వేస్టా..? మరోసారి పరువు తీసారుగా.. ఏం డైలాగులు రా బాబు..!!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఫస్ట్ టైం తెలుగులో డైరెక్ట్ గా చేసిన మూవీ “సార్”. యంగ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే గ్రాండ్గా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది . ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం చురుగ్గా పాల్గొంటూ సినిమాకి వీలైనంత పబ్లిసిటీ క్రియేట్ చేసుకుంది . మరి ముఖ్యంగా రీసెంట్గా జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు వచ్చి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు . ఈ క్రమంలోనే సినిమాకి ముందు మంచి బజ్ ఏర్పడింది. అయితే అంచనాలను డబుల్ చేస్తూ వెంకీ అట్లూరి.. ధనుష్ ఫ్యాన్స్ ఫుల్ సాటిస్ఫై చేశారు.

మరి ముఖ్యంగా ధనుష్ కెరియర్ లోనే ఈ సినిమా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పర్ఫామెన్స్ ఇచ్చిన సినిమాగా టాప్ త్రీ లో ఉంది అంటూ ధనుష్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . అయితే సినిమాలో పెద్దగా చెప్పుకోతగా కమర్షియల్ కంటెంట్ ఏమీ లేకపోయినా సరే ..నేటి సమాజంలో జరుగుతున్న విద్యావ్యవస్థలలోని లోపాలను చూపే విధానం చక్కగా ఉంది అంటూ జనాలు వెంకి అట్లూరిని మెచ్చుకుంటున్నారు . అంతేకాదు విద్య పేరుతో డబ్బును ఎలా గుంజుకుంటున్నారు ..మనుషుల రక్తాన్ని ఎలా పీల్చేస్తున్నారు ..అంటూ ఈ సినిమాలో వచ్చే డైలాగులు సూపర్ గా ఉన్నాయి.

సామాన్య ప్రజలు పడే బాధను ఈ సినిమాలో క్లియర్గా కళ్ళకు కట్టినట్లు చూపించాడు వెంకీ అట్లూరి . ఆ విషయంలో వెంకీ అట్లూరి సూపర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి . చదువుని అడ్డుపెట్టుకొని ప్రజల బలహీనతతో ఆడుకుంటున్న కొందరు బడా ప్రముఖులను టార్గెట్ చేస్తూ వెంకీ అట్లూరి సినిమా తీశాడు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ధనుష్ ఫ్యాన్స్ ఈ సినిమాను ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు . ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉన్న తెలుగు హీరోలు ఇలాంటి సినిమాను టచ్ చేయలేదని ..ఎప్పుడూ అదే పాటలు.. అదే రొమాన్స్ అంటూ కామన్ కధనే సెలెక్ట్ చేసుకున్నారని ..ఫస్ట్ టైం మా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో సత్తా చాటాడని తెలుగు ఫాన్స్ ని రెచ్చగొట్టే విధంగా కామెంట్స్ చేస్తున్నారు .

ఈ క్రమంలోనే పలువురు తెలుగు హీరోల ఫ్యాన్స్ వాళ్లకి ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు . ఏది ఏమైనా సరే ధనుష్ సార్ సినిమా బాగున్నప్పటికీ ఫ్యాన్స్ ఇలా హద్దుల మీరి కామెంట్స్ చేయడం కరెక్ట్ పద్ధతి కాదు అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు . చూడాలి మరి మొదటి రోజు ధనుష్ సార్ సినిమా ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో ..అప్పుడే అసలైన రిజల్ట్ బయటపడుతుంది అంటూ సినిమా విశ్వేషకులు అభిప్రాయపడుతున్నారు..!!

Share post:

Latest