చివ‌ర‌కు చిరంజీవికి కూడా అలాంటి ప‌రిస్థితి వ‌చ్చిందా.. ఫ్యాన్స్ అసంతృప్తి!

గత కొంతకాలం నుంచి వరుస ప్లాపులతో సతమతం అవుతున్న మెగాస్టార్ చిరంజీవి.. ఈ ఏడాది సంక్రాంతికి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులు పలకరించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ జోష్‌లో ఉన్న చిరంజీవి ప్ర‌స్తుతం `భోళా శంక‌ర్‌` సినిమాలో నటిస్తున్నాడు.

మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే కీర్తి సురేష్ చిరంజీవికి సోద‌రిగా క‌నిపించ‌బోతోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్‌ సంగీతం అందిస్తున్నాడు. త‌మిళ సూప‌ర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

 

అదేంటంటే.. ఈ చిత్రంలో చిరంజీవి పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమాని పాత్రలో కనిపించనున్నారట. ఇందులో పవన్ కల్యాణ్ గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇస్తారని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో కొంద‌రు ప‌వ‌ర్ స్టార్ అభిమానులు చివ‌ర‌కు చిరంజీవి కూడా తన సినిమా కోసం పవన్ కళ్యాణ్‌ బ్రాండ్‌ను ఉపయోగించాల్సిన ప‌రిస్థితి వచ్చింది అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. ఇక మెగాస్టార్ ఫ్యాన్స్ ఊరుకుంటారా.. అస‌లు చిరంజీవి లేకుంటే ప‌వ‌న్ ఇండ‌స్ట్రీలోనే ఉండేవారు కాదంటూ కౌంట‌ర్ ఇస్తున్నారు. మొత్తానికి సోదరుల బంధం తెరపై చూసి ఆనందించాల్సి పోయి.. అనవసర గొడ‌వ‌ల‌కు పోతున్నారు మెగా ఫ్యాన్స్‌.

Share post:

Latest