చిరు – బాలయ్య అంటే ఆ స్టార్ హీరోయిన్‌కు అంత కోప‌మా.. అందుకే వాళ్ల‌తో న‌టించ‌లేదా…!

స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వస్తే ఏ హీరోయిన్ నటించకుండా ఉండదు.. అసలు స్టార్ హీరోల సినిమాల్లో ఎప్పుడు అవకాశం వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు హీరోయిన్లు. అయితే ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ మాత్రం ఇద్దరు బిగ్ స్టార్ ల సినిమాల్లో ఛాన్స్ వచ్చినా కూడా నటించలేదట. ఇందులో ఆ బిగ్ స్టార్స్ ఎవరో తెలుసా..? మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ.

బాలయ్య, చిరంజీవి కలిసి నటించిన సినిమా ఒకటుందని మీకు తెలుసా | Do You Know  Movie About Chiranjeevi And Balakrishna Details, Chiranjeevi, Balakrishna,  Tollywood, Mulitstarrer Movies, Ntr, Trimoortulu Movie ...

 

ఈ ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు ఇప్పటికీ తమ సినిమాలతో పోటీ పడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.. అటు కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా తమ సినిమాలతో వారికి గట్టి పోటీ ఇస్తున్నారు.. ఇక ఈ సంక్రాంతికి ఇద్దరు హీరోలు తమ సినిమాలతో వచ్చి సూపర్ హిట్‌లు అందుకున్నారు. ఇప్పుడు ఓ సీనియర్ స్టార్ హీరోయిన్ మాత్రం చిరంజీవి- బాలకృష్ణ సినిమాలలో ఛాన్స్ వచ్చినా కూడా వారితో నటించలేదట. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

Actress Gautami

ఆమె సీనియర్ నటి గౌతమి.. ఈ సీనియర్ హీరోయిన్ తెలుగు తో పాటు తమిళ్లో కూడా ఎన్నో సినిమాల్లో నటించి అలరించింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర కామెంట్లు కూడా చేసింది. గౌతమి నాగార్జున- వెంకటేష్ లాంటి హీరోలతో ఎక్కువ సినిమాల్లో నటించింది. కాని చిరు- బాలయ్యతో మాత్రం ఒక్క సినిమాలో కూడా చేయలేదు.

Viral: Gautami Opens Up Why She Not Acted With Chiranjeevi And Balakrishna  - Malayalam Filmibeat

ఈ విషయంపై ఆమె స్పందిస్తూ.. చిరంజీవి- బాలకృష్ణ సినిమాల్లో నాకు నటించే అవకాశం వచ్చినా.. ఆ సమయంలో నేను బిజీ ఆర్టిస్ట్ గా ఉండటంతో డేట్స్ అడ్జస్ట్ కాలేదు. చిరంజీవి గారితో మూడు సినిమాలో నటించే అవకాశం వచ్చింది కానీ త‌న‌ డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆ ఛాన్స్ వదులుకోవాల్సి వచ్చిందని.. అలాగే బాల‌య్య‌తో ఛాన్స్ వ‌చ్చినా డేట్లు స‌ర్దుబాటు కాలేద‌ని గౌతమి చెప్పుకొచ్చింది. అయితే గౌత‌మి కామెంట్స్‌పై కొంద‌రు మాత్రం ఈ ఇద్ద‌రు హీరోల‌పై గౌత‌మికి అంత కోపం ఎందుక‌ని స‌ర‌దాగా కౌంట‌ర్ చేస్తున్నారు.

Share post:

Latest