బాలయ్యతో మరోసారి చిరంజీవి ఢీ.. ఈసారి నెగ్గేదెవరు..??

ఈ ఏడాది ప్రారంభం లో ఇద్దరు స్టార్ట్ హీరోలు వారి సినిమా లతో పోటీకి దిగారు. వారు మరెవరు కాదు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ. చిరు నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా, బాలయ్య నటించిన ‘వీర సింహ రెడ్డి’ సినిమాలు జనవరి లో సంక్రాంతి పండుగ సందర్బంగా పోటీపాడుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే మళ్ళీ ఒకసారి ఈ ఇద్దరు పోటీ పడే అవకాశం ఉంది.

మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ‘భోలా శంకర్’ సినిమా లో చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాని వేసువి సెలవులో విడుదల చెయ్యాలనుకున్నారు. కానీ భోలా శంకర్ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం పడుతుండటంతో సినిమాని పోస్ట్‌పోన్ చేసి దసరాకి విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం.

ఇక అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న #NBK108 సినిమా లో బాలయ్య హీరో గా నటిస్తున్నారు. ఈ సినిమా ని అనిల్ రావిపూడి దసరా కి విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం నందమూరి కుటుంబంలో తారక రత్న మరణం కారణం గా విషాదం చోటుచేసుకుంది. అందుకే NBK108 షూటింగ్ కి బాలయ్య కొద్దిరోజులు వాయిదా వేసారు. ఈ ఖాళీ సమయం లో అనిల్ రావిపూడి సినిమా కి సంబందించిన సంగీతం, ఇతర నిర్మాణ పనులు పూర్తిచేయనున్నట్లు సమాచారం.

ఇక త్వరలోనే షూటింగ్ తిరిగి ప్రారంభిస్తారు. ఇక రెండు సినిమాలు ఒకేసారి తలబడటానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఏడాది ప్రారంభంలో రెండు సినిమాలు ఒకేసారి తలబడతాయా? లేదంటే వారం పదిరోజులు గ్యాప్ తీసుకుంటాయా అనేది చూడాలి.

Share post:

Latest