వింత సమస్యతో బాధపడుతున్న బన్నీ.. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు..??

పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో మంచి ఇమేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ మనసు మొత్తం ఇప్పుడు పుష్ప 2 పైనే ఉంది. పాన్ ఇండియా లెవెల్ వచ్చిన ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా పుష్ప 2 కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారట. బన్నీకి తగ్గటుగానే పుష్ప సినిమా డైరెక్టర్ కూడా ప్రతి ఒక్క సీన్ ని ఆచితూచి బెస్ట్ వెర్షన్ వచ్చేల రాస్తున్నారని సమాచారం. పుష్ప సినిమా రిలీజ్ అయిన ప్రతిచోటా సూపర్ హిట్ అయ్యింది. మరీ ముఖ్యంగా హిందీలో ఈ సినిమా హిట్ అయింది కాబట్టి పార్ట్ 2 కోసం ఇంత హంగామా చేస్తున్నారు. ఒకవేళ అక్కడ సినిమా ఆడకపోయ్యి ఉంటే పార్ట్ 2 ని ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేవారు. నార్త్‌లో మంచి విజయం సాధించడం వల్లనే 2 పార్ట్‌పై అందరికి అంచనాలు పెరిగాయి.

అయితే పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ ఏ డైరెక్టర్ తో వర్క్ చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారని సమాచారం. ఎందుకంటే పుష్ప తో ఆయన రేంజ్ పెరిగిపోయింది. ఇక ఆ రేంజ్ ని అందుకోగలిగే డైరెక్టర్లు అందరూ ఎవరి ప్రాజెక్ట్స్ లో వారు బిజీ గా ఉన్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ తో కలిసి సలార్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సలార్ సినిమా తరువాత ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఒక ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యాడు. ఇక శంకర్ ఏమో చరణ్ 15, ఇండియన్ 2 సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ఆ తరువాత రణ్‌వీర్ సింగ్ తో సినిమా చేయాలనుకుంటున్నాడు. మన టాలీవుడ్ జక్కన రాజమౌళి విషయానికి వస్తే ఇంకో మూడు సంవత్సరాల వరకూ ఆయన్ని పలకరించే అవకాశమే లేదు.

ఇక ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు బాబీ కి ఛాన్స్ ఇద్దమా అంటే రొటీన్ కమర్షియల్ కథలు తప్ప కొత్తగా ప్రేక్షకులకు మెప్పించేలా తియ్యలేడు. బోయపాటి శ్రీను విషయానికి వస్తే ఆయన అఖండ 2 పై దృష్టి పెట్టాడు. ఇలా ఎవరి ప్రాజెక్ట్ తో వాళ్ళు, ఎవరి హీరోలతో వాళ్ళు చాలా బిజీ గా ఉండడం తో బన్నీ కి కొత్త సమస్య మొదలయింది. మరి పుష్ప 2 అయిపోయే లోగనైనా ఎవరో ఒకరు బన్నీకి అవకాశం ఇవ్వకపోతే సినిమాల నుంచి చాలా గ్యాప్ వచ్చే ప్రమాదం ఉంది.

Share post:

Latest