ఆషికా రంగనాథ్.. ఇటీవలే ఈ అందాల భామ `అమిగోస్` మూవీతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రానికి జేంద్రరెడ్డి దర్శకత్వం వహించాడు.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 10న విడుదలైంది.
అయితే ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ, ఆషికా రంగనాథ్ కు మాత్రం అందం, అభినయం, నటన పరంగా మంచి మార్కులు పడ్డాయి.
ఆషికాకు ఇదేమి తొలి చిత్రం కాదు. కన్నడలో ఈ ముద్దుగుమ్మ చాలే సినిమాలే చేసింది. అక్కడ తనంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం కన్నడలో పలు చిత్రాలు చేస్తున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లోనూ బిజీ కావాలని ప్రయత్నాలు చేస్తోంది.
ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షూట్లతో అందరినీ ఎట్రాక్ట్ చేస్తోంది. తాజాగా మల్దీవ్స్ కు వెకేషన్ కు వెళ్లిన ఆషికా.. అక్కడ బీచ్ లో అందాల విందు చేసింది.
ఏకంగా షర్ట్ బటన్స్ తీసేసి మరీ ఘాటుగా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆషికా తాజా ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అమిగోస్ బ్యూటీ అందాలు చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు.