అల్లు అర్జున్ న్యూలుక్ చూశారా? దిమ్మ తిరిగిపోతుంది అంతే!

అల్లు అర్జున్… మొదట మెగాఫ్యామిలీ నుండి పరిచయమై, నేడు అల్లువారి ఫ్యామిలీకి పేరు తెచ్చిన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా బాక్గ్రౌండ్ నుండి వచ్చినప్పటికీ తనకంటూ ఓ స్టైల్ ఏర్పరుచుకొని, స్టయిలిష్ స్టార్ గా ఎదిగిన ఈ స్టార్.. తన నటనతో దర్శకుడు సుకుమార్ ద్వారా ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. ఇకపోతే అల్లు అర్జున్ స్టార్ డం గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది అని చెప్పుకోవాలి.

ఈ సినిమాతో ఏకంగా మనోడు పాన్ ఇండియా స్టార్‏గా ఎదిగిపోయాడు. ఈ సినిమాతో ఉత్తరాదిలో కూడా బన్నీకి ఫ్యాన్స్ పెరిగిపోయారు. దీంతో బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మనవాళ్ళు. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇందులో మలయాళం నటుడు ఫహద్ ఫాజిల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కీలకపాత్రలలో నటిస్తున్న సంగతి విదితమే. ఓవైపు పుష్ప 2 షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు బన్నీ. తాజాగా ఆయన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్చర్ మార్చారు.

అవును, బ్లాక్ షర్ట్ లో కర్లీ హెయిర్ తో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. కాగా ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుందని సమాచారం. పుష్ చిత్రంలో పక్క ఊరమాస్ లుక్కులో కనిపించిన బన్నీ.. ఇప్పుడు పుష్ప 2 చిత్రీకరణలో ఎలాంటి అవతారంలో కనిపిస్తారనే క్యూరియాసిటీని ఈ పిక్ ద్వారా పెంచేశారు. అలాగే పుష్ప 2 స్క్రీప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు పుష్ప సినిమాలో కనిపించిన క్యారెక్టర్స్ కాకుండా కొత్త క్యారెక్టర్స్ కూడా కనిపించనున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో విజయ్ సేతుపతి, సాయి పల్లవి నటించనున్నారని ముందు నుంచి టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన అంటూ రాలేదు.

Share post:

Latest