నాగార్జున‌తో సినిమా అంటూ ప్ర‌చారం.. అల్ల‌రి న‌రేష్ ఏమ‌న్నాడంటే?

గ‌త కొన్నేళ్ల నుంచి స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న అక్కినేని నాగార్జున‌.. గ‌త ఏడాది `ది ఘోస్ట్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. ఈ మూవీ అనంత‌రం నాగార్జున యంగ్ రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఓ సినిమా చేయ‌బోతున్నాడు.

నాగార్జున కెరీర్ లో తెర‌కెక్క‌బోయే 99వ చిత్ర‌మిది. ప్రీ ప్రొడెక్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రంపై త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంది. ఎంటర్‌టైనింగ్ డ్రామా గా తెరకెక్కబోతున్న ఈ మూవీలో నాగార్జున రెండు భిన్నమైన క్యారెక్టర్స్ చేయబోతున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే ఈ సినిమాను మ‌ల్టీస్టార‌ర్ గా తెర‌కెక్కించ‌బోతున్నార‌ని.. ఇందులో నాగార్జున‌తో పాటు అల్ల‌రి న‌రేష్ కూడా ఉంటాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే ఈ విష‌యంపై `ఉగ్రం` టీజ‌ర్ లాంఛ్ ఈవెంట్ లో అల్ల‌రి న‌రేష్ స్పందించాడు. ఆ సినిమా కథ విన్నానని, చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తారని అల్ల‌రి న‌రేష్ తెలుపారు. ఆల్మోస్ట్ ఈ సినిమా ఉండబోతుందనే అభిప్రాయాన్ని అల్లరి నరేష్‌ వెల్లడించారు. కాగా, ఉగ్రం విష‌యానికి వ‌స్తే.. క్రైమ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ గా అల్ల‌రి న‌రేష్ సీరియ‌స్ రోల్ లో న‌టించాడు. తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఉగ్రం టీజ‌ర్ కు అదిరిపోయే రెస్పాన్స్ ద‌క్కింది.

 

Share post:

Latest