`నాటు నాటు`కు స్టెప్పులేసిన ఆలియా.. బిడ్డ పుట్టిన 4 నెల‌ల‌కే అద‌ర‌గొట్టేసిందిగా!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్‌` సినిమాలో `నాటు నాటు` పాట ఎంత‌లా పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. గ‌త ఏడాది కాలం నుంచి అంద‌రి నోట ఈ పాటు నానుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా ప్రతిష్టాత్మక ఆస్కార్స్ రేసులోనూ నిలిచింది. అయితే తాజాగా ఈ పాటుకు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ స్టెప్పులేసింది.

ఆదివారం జరిగిన ఓ అవార్డు ఫంక్ష‌న్ కు ఆలియా భ‌ట్‌ హాజరైంది. గంగూబాయి కఠియావాడి, డార్లింగ్స్ చిత్రాల‌కుగానూ ఆమెను రెండు అవార్డులు వరించాయి. ఈ నేపథ్యంలోనే సంతోషంతో ఉప్పొంగిపోయిన ఆలియా భ‌ట్‌.. తన డాన్స్ తో ఫ్యాన్స్ ను హుషారెత్తించింది. తాను నటించినా హిట్ సినిమాల్లోని పాటలకు కాలు కదిపింది.

ఈ క్రమంలోనే `నాటు నాటు` హిందీ వెర్ష‌న్ సాంగ్ కు దుమ్ము లేపేలా స్టెప్పులేసింది. అది కూడా చీర‌లో.. పైగా నాలుగు నెల‌ల క్రిత‌మే ఆలియా భ‌ట్ ఓ బిడ్డ‌కు జ‌న్మనిచ్చింది. ఇంత‌లోనే స్టేజ్ పై కనిపించిన ఆలియా.. ఏకంగా నాటు నాటు పాటకు డ్యాన్స్ చేసి అద‌ర‌గొట్టేసింది. ఆమె ఎనర్జీని చూసి అభిమానులు షాక్ తింటున్నారు.

https://www.instagram.com/reel/CpKK9IgSF03/?utm_source=ig_web_copy_link

Share post:

Latest