సీటుపై ఆలీ ఆశ..జగన్ క్లారిటీ ఇస్తారా?

నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలని చెప్పి సినీ నటుడు ఆలీ ఆశపడుతున్నారు. జగన్ ఏదొక సీటు ఇవ్వకపోతారా అని చూస్తున్నారు. ఎలాగైనా ఎమ్మెల్యే అవ్వాలనే తపన కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్న పోటీలో ఆలీకి సీటు దక్కడం, సీటు దక్కిన గెలవడం అంత ఈజీనా అంటే చెప్పడం కష్టమే. మొదట పార్టీలో సీటు దక్కడం కష్టమైన పని. కానీ జగన్ అనుకుంటే సీటు ఇవ్వడం పెద్ద విషయం కాదు.

అయితే ఆలీ..కొన్ని సీట్లపై ఆశలు పెట్టుకున్నారని తెలిసింది. ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ ఉన్న సీట్లపై ఫోకస్ పెట్టారు. వాస్తవానికి గత ఎన్నికల్లో పార్టీలో చేరిన ఆలీ..అప్పుడే పోటీ చేయాలని చూశారు గాని జగన్ సీటు ఇవ్వలేదు. దీంతో పార్టీ కోసం ఆలీ ప్రచారం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా యాక్టివ్ గానే రాజకీయాల్లో కనిపిస్తున్నారు. అలాగే ఆయనకు ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చారు. ఇది ఒక మొక్కుబడి పదవి అని చెప్పవచ్చు.

అయితే ఆలీ ఎలాగైనా నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. అందుకే ఇటీవల జగన్ ఆదేశిస్తే..పవన్ పై కూడా పోటీకి రెడీ అని చెప్పారు. ఇక ఆలీ కోరుకుంటున్న సీట్లు…పుట్టిన గడ్డ రాజమండ్రి సిటీ, అలాగే ముస్లిం ఓట్లు ఉన్న గుంటూరు ఈస్ట్, కర్నూలు సిటీ, కడప సిటీ..అయితే ఈ మూడు స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిని కాదని జగన్ ఆలీకి సీటు ఇవ్వడం అనేది డౌటే.

ఇక రాజమండ్రి సిటీలో ఎంపీ మార్గాని భరత్ ఉన్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఆయనే పోటీ చేయాలని చూస్తున్నారు. మరి అలాంటప్పుడు ఆలీకి ఏ సీటు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది..అసలు సీటు ఇస్తారో లేదో చూడాలి.