సిద్ధార్థ్ ను కాద‌ని మ‌రో హీరోకు ల‌వ్ ప్ర‌పోజ్‌ చేసిన అదితి.. ఎవ‌రా హీరో..?

హీరో సిద్ధార్థ్, ప్ర‌ముఖ హీరోయిన్ అదితి రావు హైదరి ప్రేమ‌లో ఉన్నార‌ని గ‌త కొద్ది రోజుల నుంచి ఇటు సోష‌ల్ మీడియాతో పాటు అటు ప్ర‌ధాన మీడియాలోనూ వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఇటీవల కాలంలో వీరిద్ద‌రూ చాలా చోట్లకు వెళ్తున్నారు. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ అనేక సార్లు కెమెరా కంటికి చిక్కారు.

ఇటీవ‌ల శర్వానంద్ నిశ్చితార్థం వేడుకలోనూ కలిసి కనిపించారు. దీంతో సిద్ధార్థ్, అదితి ప్రేమ‌లో ఉన్నార‌ని ఎవ‌రికి వారు క‌న్ఫార్మ్ చేసేసుకున్నారు. కానీ, అదితి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. నేడు వాలంటైన్స్ డే సంద‌ర్భంగా సిద్ధార్థ్ ను కాద‌ని అదితి మ‌రో హీరోకు ల‌వ్ ప్ర‌పోజ్ చేసింది. ఈ హీరో మ‌రెవ‌రో బాలీవుడ్ సీనియర్ స్టార్ ధర్మేంద్ర.

అయితే ఇదంతా ఓ షాలో భాగంగా జ‌రిగింది. త‌న ఫేవ‌రెట్ హీరో అయిన ధర్మేంద్రకు అదితి రోజా పువ్వు ఇచ్చి ప్రేమను చాటుకుంది. ఇందుకు సంబంధించిన పిక్స్ ను ఆమె త‌న్ ఇన్‌స్టాలో పంచుకుంటూ `ది మోస్టెస్ట్ హ్యాండ్సమ్` అని ధర్మేంద్రను ఉద్ధేశిస్తూ క్యాప్ష‌న్ ఇచ్చింది. ఈ పోస్ట్ లో నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. ప్రేమికుల రోజు బాయ్‌ఫ్రెండ్ సిద్ధార్థ్ కి భ‌లే షాకిచ్చావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అదితి పోస్ట్ పై సిద్ధార్థ్ స్పందిస్తూ రెండు ల‌వ్ సింబ‌ల్స్ పంచుకోవ‌డం విశేషం.

https://www.instagram.com/p/CooVoENtp-Y/?utm_source=ig_web_copy_link