డేట్ కు వెళ్లిన సిద్ధార్థ్-అదితి.. మ‌రోసారి అడ్డంగా దొరికేసిన ప్రేమ ప‌క్షులు!

ప్ర‌ముఖ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు ప్రేమ‌లో ఉన్నారంటూ గ‌త కొద్ది రోజుల నుంచి జోరుగా వార్త‌లు వ‌స్తున్న‌ సంగ‌తి తెలిసిందే. వీరిద్దరూ మహాసముద్రం సినిమాలో తొలిసారి కలిసి నటించారు. అయితే ఈ సినిమా స‌మ‌యంలో ఏర్ప‌డ్డ ప‌రిచ‌య‌మే ప్రేమ‌గా మారిందని.. త్వ‌ర‌లోనే ఈ జంట పెళ్లి పీట‌లెక్క‌నున్నారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఒకరి బర్త్ డేకి ఒకరు ప్రేమతో పోస్ట్ లు చేయ‌డం, ప‌లు మార్లు జంట‌గా మీడియాకు చిక్క‌డం, రీసెంట్ గా జ‌రిగిన శ‌ర్వానంద్ ఎంగేజ్మెంట్ కు క‌లిసి వెళ్ల‌డం వంటి అంశాలు నెట్టింట జ‌రుగుతున్న ప్ర‌చారానికి మ‌రింత బ‌లాన్ని చేకూర్చాయి. ఇప్పుడు మ‌రోసారి ఈ ప్రేమ ప‌క్షులు అడ్డంగా దొరికేశారు.

పీకల్లోతూ ప్రేమలో మునిగి తేలుతున్న సిద్ధార్థ్-అదితి తాజాగా ముంబయిలోని ఓ రెస్టారెంటుకు లంచ్ డేట్ కు వెళ్లారు. ఒకే కారులో నుంచి రెస్టారెంటుకు విచ్చేసిన సిద్ధార్థ్-అదితి మీడియాకు చిక్కారు. సిద్ధార్థ్ పట్టించుకోకుండా లోపలకు వెళ్లగా.. అదితి మాత్రం కెమెరాకు ఫోజులిచ్చింది. దీంతో వీరిద్ద‌రి ప్రేమ వార్త‌లు మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చాయి. కొంద‌రు నెటిజ‌న్లు ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతారంటూ సిద్ధార్థ్-అదితిల‌ను ప్ర‌శ్నిస్తున్నారు.

Share post:

Latest