బాలయ్యకి హీరోయిన్‌గా తల్లిగా నటించిన.. ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..!

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి మరియు నట‌సింహ నందమూరి బాలకృష్ణ మిగిలిన హీరోలతో కలిసి హీరోయిన్‌గా నటించి సినీ అభిమానులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ సీనియర్ నటి సుహాసిని తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలు. సుహాసిని తన సినీ కెరీర్‌లో ఎలాంటి వివాదాలను తన దగ్గరకు రానివ్వకుండా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తర్వాత సౌత్ ఇండియన్ దిగ్గ‌జా దర్శకుడు మణిరత్నంను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అతడి కోసం దర్శకత్వం త్యాగం చేసిన సుహాసిని .. కారణం ఏంటి.. | Heroine  Suhasini Left Direction Career For Whom, Heroine Suhasini, Suhasini  Maniratnam, Suhasini Husband, Suhasini About Tollywood Industry ...

ఆమె చేసిన సినిమాల్లో కూడా తన నటనకు ప్రాధాన్యత ఇస్తూ గ్లామర్ షోకు దూరంగా ఉంటూ తన చీరకట్టుతో తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తూ ప్రేక్షకులను అలరించింది. అందువల్లే ఒకప్పుడు హీరోయిన్‌గా నటించిన ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప‌లు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే ఆమెకు వచ్చిన ప్రతి పాత్రను ఒప్పుకోవడం లేదు.. చేసే సినిమాలు కూడా ఎంతో సెలెక్టివ్ గా చూసుకుంటూ సినిమాలను ఒప్పుకుంటున్నారు.

10 Balakrishna's Best Movies | Best Films of Balakrishna

దీనివల్లే సుహాసిని సినిమాల్లో అంతగా కనిపించడం లేదు. రీసెంట్‌గా వచ్చిన ఓ వెబ్ సిరీస్ లో ఏకంగా అమ్మమ్మ పాత్రలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. అయితే సుహాసిని తన కెరీర్ బిగినింగ్ లో నందమూరి బాలకృష్ణతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. మంగమ్మగారి మనవడు, బాలగోపాలుడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి వంటి ఎన్నో సినిమాల్లో బాలయ్యకు జంటగా నటించింది.

అయితే సుహాసిని బాలకృష్ణకు హీరోయిన్ గానే కాకుండా తల్లిగా కూడా నటించింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 2014లో వచ్చిన లెజెండ్ సినిమాలో బాలయ్యకు తల్లిగా సుహాసిని నటించారు. ఈ విధంగా సుహాసిని బాలకృష్ణతో హీరోయిన్‌గా, తల్లిగా నటించి మెప్పించారు. సుహాసిని సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్ గా ఉంటారు. తన సినిమాలు, ప్రాజెక్ట్‌లు, షోలకు సంబంధించిన క్యాస్టూమ్స్‌తో సుహాసిని ఫోటో షూట్ చేస్తుంటుంది.

A poignant tribute to her father: Suhasini Maniratnam's new theatrical  venture | The News Minute

ఆ ఫోటోలను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు ఆమె కొన్ని తెలుగు సినిమాలో కూడా చేస్తోన్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా సుహాసిని తనకు నచ్చిన పాత్రలను పోషించుకుంటూ వెళ్తోన్నారు. అంతే కాకుండా తమిళ చిత్రాలతో కూడా ఆమె బిజీ గా ఉన్నారు.

Share post:

Latest