విశాల్ సినిమా షూటింగ్లో ప్రమాదం.. షాకింగ్ పోస్ట్ షేర్ చేసిన విశాల్..!!

హీరో విశాల్ మరొకసారి సినిమా షూటింగ్ ప్రమాదం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విశాల్ షూటింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే విశాల్ షూటింగ్లో ప్రమాదాలు జరగడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో కూడా ఎన్నోసార్లు ఆయన షూటింగ్లో గాయపడిన సందర్భాలు ఉన్నాయి. అయితే విశాల్ కు ఈసారి మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు. ఎంతటి రిస్క్ షాట్ అయినా సరే ఎలాంటి డూపు లేకుండా సొంతంగా చేసే విశాల్ షూటింగ్లో ఇప్పుడు ప్రమాదం జరగడం జరిగింది.

Alive by a few inches and seconds: Vishal on Mark Antony sets accident

దీంతో అభిమానులు చాలా కలవరపేట్టేలా చేస్తోంది. విశాల్ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్నది. ఇందులో భాగంగానే ఒక ఫైట్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్న సమయంలో ఇందుకోసం ఫైట్ మాస్టర్ అంతా సిద్ధం చేయడం జరిగింది. కానీ ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు కానీ యాక్షన్ చెప్పాక వాహనం ఒక్కసారిగా ఫైటర్ల మీదికి దూసుకు వచ్చింది ఆ టైంలో విశాల్ తో పాటు చాలామంది ఫైటర్స్ అక్కడ ఉన్నారు. విశాల్ నేలపైన మోకాళ్లపై ఉండడం జరిగింది. గోడను వెహికల్ ఢీ కొట్టినప్పుడు బ్లాస్ట్ అయింది ఆ తర్వాత వాహన అక్కడే ఆగిపోవాలి కానీ ఏం జరిగిందో తెలియదు కానీ ఆగకుండా ముందుకు దూసుకు వచ్చింది.

ఈ క్రమంలోనే అప్రమత్తమైన అంత అక్కడ సిబ్బంది ఒక్కసారిగా పరుగులు పెట్టారు. అయినా కూడా నలుగురికి గాయాలైనట్లుగా సమాచారం. ఆ వెంటనే వీరిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. అందుకు సంబంధించి విషయాలు ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. అంతేకాకుండా కొన్ని ఇంచుల దూరంలో చావు కనిపించింది అంటూ కూడా కామెంట్లు చేయడం జరిగింది ఆ తర్వాత షూటింగ్ యధావిధిగా సరిపోయిందని తెలిపారు విశాల్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Vishal (@actorvishalofficial)

Share post:

Latest