`వాల్తేరు వీర‌య్య‌` కాసుల వ‌ర్షం.. 10 రోజుల్లో ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోలుగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌ `వాల్తేరు వీర‌య్య‌`. ఇందులో శృతి హాస‌న్‌, కేథ‌రిన్ హీరోయిన్లుగా న‌టించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుక‌గా జనవరి 13న విడుద‌లై మిక్స్డ్ టాక్ ను అందుకుంది.

అయితే టాక్ ఎలా ఉన్నా.. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. విడుద‌లైన మూడు రోజుల‌కే వంద కోట్ల క్ల‌బ్ లో చేరిన ఈ చిత్రం.. ప‌ది రోజులు పూర్తి చేసుకునే స‌మయానికి బ‌య్య‌ర్ల‌కు భారీ లాభాల‌ను తెచ్చి పెట్టింది. 10వ రోజు సండే అడ్వాంటేజ్ తో తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.66 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా.. వరల్డ్ వైడ్ గా రూ. 7.41 కోట్ల షేర్ ని ద‌క్కించుకుంది.

రూ. 89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. ప‌ది రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 114.13 కోట్ల షేర్ ను అందుకుని దుమ్ము దుమారం రేపింది. ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఈ చిత్రం.. రూ. 25 కోట్ల లాభాల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఇక‌ ఏరియాల వారీగా వాల్తేరు వీర‌య్య 10 రోజులు టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 31.45 కోట్లు
సీడెడ్: 16.08 కోట్లు
ఉత్త‌రాంధ్ర: 14.39 కోట్లు
తూర్పు: 9.87 కోట్లు
పశ్చిమ: 5.49 కోట్లు
గుంటూరు: 7.16 కోట్లు
కృష్ణ: 6.94 కోట్లు
నెల్లూరు: 3.65 కోట్లు
—————————————–
ఏపీ+తెలంగాణ‌= 95.03 కోట్లు(153.85 కోట్లు~ గ్రాస్‌)
—————————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 7.35 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 11.75 కోట్లు
—————————————-
వ‌ర‌ల్డ్ వైడ్‌= 114.13 కోట్లు(195.45 కోట్లు~ గ్రాస్‌)
—————————————-