Trailer: అభిరామ్ కి ఇంతటి అహింస సక్సెస్ అందించేనా..?

టాలీవుడ్ లో దగ్గుబాటి రానా తమ్ముడుగా అభిరామ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని ఎన్నో సంవత్సరాలలో ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు తాజాగా డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వస్తున్న అహింస సినిమాతో మొదటిసారి హీరోగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి గతంలో ఎన్నో అప్డేట్లు కూడా విడుదలయ్యాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ను విడుదల చేయడం జరిగింది. అది కూడా రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ను విడుదల చేశారు.

Ram Charan Launches The Trailer Of Teja And Abhiram's 'Ahimsa' Movieడైరెక్టర్ తేజ ఎప్పుడు కూడా ఏదో ఒక స్పెషల్ తోనే పలు సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు. ట్రైలర్ విషయానికి వస్తే.. బుద్ధుడు గాంధీ లాంటి మనస్తత్వం ఉండే కుర్రాడు భూమిని కొందరు లాక్కోవాలని చూస్తూ ఉంటారు. తన భూమిని లాక్కొని కుటుంబాన్ని బాధ పెట్టాలనుకునే వారికి బుద్ధుడు లాంటి యువకుడు కృష్ణుడిగా మారి ధర్మం కోసం యుద్ధం ఎలా చేస్తాడు అనే కథ అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఈ ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతోంది. ఇందులో లాయర్ పాత్రలో హీరోయిన్ సదా కూడా నటిస్తోంది. ఈ చిత్రం మొత్తం ఫారెస్ట్ ఏరియాలలో ఎక్కువగా చిత్రించినట్లుగా ఈ లొకేషన్స్ చూస్తే స్పష్టం అవుతోంది.

ఆర్పి పట్నాయక్ ఈ చిత్రాన్ని సంగీతం అందించారు. డైరెక్టర్ తేజ ఆర్ పి పట్నాయక్ కాంబినేషన్లో చాలా ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా అహింస.దగ్గుబాటి ఫ్యామిలీతో మెగా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది అందుచేతనే అభిరామ్ సినిమా ట్రైలర్ కు రామ్ చరణ్ గెస్ట్ గా రావడం జరిగింది. ముఖ్యంగా రానా రామ్ చరణ్ కూడా మంచి స్నేహితులు ఆ ఫ్రెండ్ షిప్ కారణంగానే అభిరామ్ కి తన వంతు సపోర్ట్ చేస్తున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం ఈ ట్రైలర్ వైరల్ గా మారుతోంది.