స్టార్ హీరోల సినిమాలు కొన్ని రోజుల గ్యాప్ లో విడుదల అవటం వలన ఒక సినిమా ప్రభావం మరో సినిమాపై పడుతుందనే విషయం తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన నాగార్జున- బాలకృష్ణ సినిమాలు కూడా ఎన్నోసార్లు బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి హీరోల సినిమాలు 2012లో పోటీపడ్డాయి. నాగ్ నటించిన షిరిడి సాయి, బాలయ్య నటించిన శ్రీమన్నారాయణ సినిమాలు కేవలం ఏడు రోజుల గ్యాప్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
అయితే ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల అనుకున్న అంచనాలను అందుకోలేకపోయాయి. నటసింహం బాలయ్య తన సినిమాల రిలీజ్ విషయంలో కొన్ని థియేటర్లను ఎంతో సెంటిమెంట్ గా భావిస్తారు. బాలయ్య కూకట్ పల్లి ఫేమస్ థియేటర్ లో శ్రీమన్నారాయణ సినిమా విడుదలై మంచి కలెక్షలను నమోదు చేస్తుండగా వారం రోజుల గ్యాప్ లో నాగ్ షిరిడి సాయి విడుదలవడంతో ఈ సినిమా కోసం శ్రీమన్నారాయణ మూవీని తీసేశారు.
ఇక తన సినిమానే థియేటర్లో ప్రదర్శించే విధంగా బాలయ్య అడుగులు వేసిన ఫలితం లేకుండా పోయిందని తెలుస్తుంది. నాగార్జున సినిమా వాళ్ళ తన సినిమాకు నష్టం జరిగిందని భావించిన బాలయ్య ఆ సందర్భం దగ్గర్నుంచి నాగార్జున ఫ్యామిలీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఒకానొక సందర్భంలో నాగ్ చిన్న కొడుకు అఖిల్ గురించి కూడా పరోక్షంగా బాలయ్య కామెంట్లు చేయడం వెనక అసలు కారణం ఇదేనని తెలుస్తుంది. అక్కినేని- నందమూరి కుటుంబాల మధ్య ఇలాంటి విషయాలతో దూరం అంతకంతకు పెరుగుతూ వస్తుంది.
ఈ వివాదం విషయంలో ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆసక్తి చూపించడం లేదు. ఈ ఇద్దరిలో ఒక హీరోకు సపోర్ట్ చేస్తే మరో హీరో కుటుంబం నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. బాలకృష్ణ ఎన్ని కామెంట్లు చేసినా నాగ్ స్పందించకపోవడం గురించి కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం రాబోయే రోజుల్లో ఇంకన్ని మలుపులు తిరుగుతుందో లేక సద్దుమణుగుతుందో చూడాలి.