జబర్దస్త్ నుండి బయటకి వచ్చేయడానికి అసలు కారణం ఇదే: సింగర్ మనో

సింగర్ మనో గురించి తెలియని వారు వుండరు. అలాగే జబర్దస్త్ గురించి కూడా తెలియని వారు వుండరు అంటే అతిశయోక్తి కాదేమో. బుల్లితెరపై ప్రసారమవుతున్న షోస్ లలో జబర్దస్త్ మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ కార్యక్రమం ప్రారంభమై ఒక దశాబ్దం దాటుతున్నా నేటికీ ఎంతో విజయవంతంగా ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు అనడంలో ఆశ్చర్యం లేదు. ఈ కార్యక్రమానికి మొదట్లో రోజా నాగబాబు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించగా ఆ తరువగా నాగబాబు తప్పుకోవడంతో ఆయన స్థానంలో సింగర్ మనో వచ్చారు. ఇలా సింగర్ మనో కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేసేవారు.

అయితే సింగర్ మనో మాత్రం కొద్ది కాలానికే ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడం చాలా హాట్ టాపిక్ గా మారింది. ఈ విధంగా సింగర్ మనో జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఈయన వెళ్లిపోవడానికి గల కారణం ఏంటి? అని పెద్ద ఎత్తున సందేహాలను ప్రేక్షకులను తొలిచి వేసాయి. ఈ క్రమంలో మల్లెమాల వారితో మనస్పర్ధలు రావడం వల్లే ఈ కార్యక్రమం నుంచి మనో తప్పకున్నారనే వార్తలు బాగా వినిపించాయి. తాజాగా ఈ విషయంపై సింగర్ మనో స్పందించారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ… తనకు మల్లెమాల వారితో ఎలాంటి గొడవలు లేవని, తాను జబర్దస్త్ కార్యక్రమానికి కాస్త విరామం మాత్రమే ఇచ్చానని, త్వరలో మరలా ఈ షోలో తాను పార్టిసిపేట్ చేస్తానని చెప్పుకొచ్చాడు. కోవిడ్ కారణంగా కొన్ని షోలు వాయిదా పడ్డాయని, ఇందులో ఇళయరాజా, ఎఆర్ రెహమాన్‌లతో తాను చేయాల్సిన షోలను ప్రస్తుతం పూర్తి చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, అందుకే కాస్త ఈ ఎడబాటు అని చెప్పుకొచ్చాడు. ఈ కార్యక్రమాలు పూర్తి అయిన వెంటనే తను జబర్దస్త్ కార్యక్రమంతో పాటు సరిగమప కార్యక్రమానికి కూడా హాజరుకానున్నట్లు ఈ సందర్భంగా స్పందించాడు.

Share post:

Latest