బాబోయ్ ఇవేం రూల్స్..జగన్‌ మాదిరిగానే పాదయాత్ర.!

నారా లోకేష్ పాదయాత్రకు పోలీసులు అనుమతించిన విషయం తెలిసిందే. అయితే పాదయాత్రకు కఠినమైన ఆంక్షలు విధించారు. ఈ రూల్స్ తో పాదయాత్ర చేయడం కష్టమని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. కాళ్ళు కట్టేసి ముందుకెళ్లమని చెబుతున్నట్లుగా పోలీసుల రూల్స్ ఉన్నాయని అంటున్నారు. జనవరి 27 నుంచి కుప్పంలో మొదలుకానున్న లోకేష్ పాదయాత్రకు డి‌జి‌పి పర్మిషన్ ఇచ్చి ఉంటే..రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రూల్ ఉండేది..కానీ ఎక్కడకక్కడ సబ్ డివిజన్ పరిధిలో డి‌ఎస్‌పి ద్వారా పర్మిషన్ తీసుకోవాలి.

అంటే ప్రతి సబ్ డివిజన్ లో డి‌ఎస్‌పిల పర్మిషన్ తప్పనిసరి. అయితే తాజాగా పలమనేరు డి‌ఎస్‌పి ఎన్‌. సుధాకర్‌ రెడ్డి ఊహించని విధంగా రూల్స్ పెట్టారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అందులో ముఖ్యంగా ఈ అనుమతి ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం ఆరు వరకే వర్తిస్తుంది. (పలమనేరు సబ్‌డివిజన్‌ పరిధిలో మాత్రమే) అని చెప్పుకొచ్చారు..అంటే తర్వాత ఫ్రెష్ గా మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలి..ఇలా పాదయాత్ర చేస్తున్నంత కాలం పర్మిషన్లు తీసుకోవాల్సిందే.

ఎలాగో రోడ్లపై సభలు పెట్టకూడదని రూల్ పెట్టారు.. కానీ అవసరమైన రోడ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఇటువంటి సమావేశాల్లో మైక్‌ ఉపయోగించాలంటే ముందుగా పోలీస్‌ అనుమతి తీసుకోవాలని ఆంక్షలు పెట్టారు. ఇక పాదయాత్రలో డీజే సిస్టమ్‌, లౌడ్‌ స్పీకర్లు వాడటానికి వీల్లేదని, తక్కువ శబ్దం వచ్చే సింగిల్‌ సౌండ్‌ బాక్స్‌ సిస్టం మాత్రమే వాడాలని రూల్ పెట్టారు. ఇంకా పలురకాల రూల్స్ పెట్టుకుంటూ వచ్చారు.

ఈ రూల్స్ ఏమో గాని..జగన్ ఏ మాదిరిగా పాదయాత్ర చేశారో..తాము అదే మాదిరిగా పాదయాత్ర చేస్తామని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఏ ఒక్క రూల్ అతిక్రమించిన, పాదయాత్ర అనుమతి రద్దు చేస్తామని పోలీసులు అంటున్నారు. మొత్తానికి ఇన్ని రూల్స్‌తో లోకేశ్ పాదయాత్ర ఎలా సాగుతుందో చూడాలి.