సింగర్ మంగ్లీ ఒక్క పాటకు ఎంత రెమ్యునరేషన్ పుచ్చుకుంటుందో తెలిస్తే షాకే!?

ప్ర‌ముఖ సింగర్ మంగ్లీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈమె అస‌లు పేరు సత్యవతి రాథోడ్. టీవీ వాఖ్యాతగా కెరీర్ స్టార్ట్ చేసిన మంగ్లీ.. ఆ త‌ర్వాత త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన సంగీతానికి ద‌గ్గ‌రైంది. బతుకమ్మ పాటలతో ఫెమస్ అయ్యింది. ఫోక్ సాంగ్స్ తో భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఆ క్రేజ్ తో సినిమాల్లో పాటలు పాడే అవకాశాలు అందుకుంది.

మంగ్లీ పాడిన పాటలన్ని సూపర్ హిట్స్ గా నిలిచాయి. తనదైన గాత్రంతో ఎంతో అద్భుతంగా పాటలు పాడుతూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న మంగ్లీ.. ఇప్పుడు టాలీవుడ్ లోనే టాప్ సింగ‌ర్స్ లో ఒక‌రిగా కొన‌సాగుతోంది. అయితే ఈ అమ్మ‌డు ఒక్క పాట‌కు పుచ్చుకునే రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాక్ అయిపోతారు.

ఎందుకంటే, మంగ్లీ ఒక్క పాట‌కు రూ. 7 ల‌క్ష‌ల రేంజ్ లో ఛార్జ్ చేస్తుంది. స్టార్ హీరో సినిమా అయినా.. యంగ్ హీరో సినిమా అయినా మంగ్లీ మాత్రం అదే రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ అందుకుంటుంద‌ట. అలాగే మంగ్లీకి సొంతంగా ఓ యూట్యూబ్‌ ఛానెల్ ఉంది. ఆమె ఓన్ గా పాటలు నిర్మించి అందులో విడుదల చేస్తోంది. కొన్ని ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ కు పాటులు పాడుతోంది. ప‌లు టీవీ ప్రోగ్రామ్స్‌, ఈవెంట్స్ లో సైతం మంగ్లీ పాట‌లు ప‌డుతూ గ‌ట్టిగానే సంపాదిస్తోంది.