ఈసారి కూడా సక్సెస్ కొట్టేలా ఉన్న సమంత..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత ఒకవైపు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. గత ఏడాది యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత మంచి సక్సెస్ను అందుకుంది. ఇక దీంతో సమంత క్రేజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. తాజాగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవుతున్న శాకుంతలం సినిమా డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ని కూడా గడిచిన కొద్ది రోజుల క్రిందట విడుదల చేయడం జరిగింది.

ట్రైలర్ ,పోస్టర్స్ కు మంచి స్పందన రావడంతో ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి ట్యూన్ మణిశర్మ అందించారు. నిన్నటి రోజున ఈ సినిమాకు సంబంధించి ఒక పాటను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ పాట కూడా పూర్తి విజువల్స్ తో సిల్వర్ స్క్రీన్పై అద్భుతంగా కనిపించబోతున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా వచ్చే నెల 17వ తేదీన విడుదల కాబోతోంది. మహాకవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమా కథలు రాసుకున్నారు.

గుణశేఖర్ ఇప్పటివరకు ఇండియన్ సినీ ప్రేక్షకులు చూడని అందాలను సిల్వర్ స్క్రీన్ పైన వావ్ అనిపించే అద్భుతంగా రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన మల్లికా మల్లికా అనే పాట కూడా ఉపయోగించిన యానిమేషన్ గ్రాఫిక్స్ కూడా బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఇందులో సమంత కు జోడిగా దేవ్ మోహన్ నటిస్తున్నారు. సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. ఈ చిత్రం తెలుగు, హిందీ ,తమిళ్, మలయాళం కన్నడ వంటి భాషలలో గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాని నిర్మాత గిరిరాజు సమర్పణల తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాతో కచ్చితంగా సమంత మరొక విజయాన్ని అందుకుంటుందని చెప్పవచ్చ.