ర‌వితేజ ఫ్యాన్స్‌కు అడ్డంగా దొరికిన చిరంజీవి.. అలా ఎలా అంటారంటూ ఫైర్‌!

మెగాస్టార్ చిరంజీవి, మాస్‌ మహారాజా రవితేజ ఇటీవల `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన‌ సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

ఈ నేపథ్యంలోనే శనివారం `వాల్తేరు వీర‌య్య‌` సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ గా విచ్చేశారు. అయితే ఈ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి నోరు జారి రవితేజ ఫ్యాన్స్ కు అడ్డంగా దొరికిపోయాడు. ఈ సక్సెస్ మీట్ లో చిరు మాట్లాడుతూ.. ఓ పెద్ద హీరో చిన్న హీరో పోస్టర్ ను ముద్దాడాడు అంటూ ఒక సందర్భంలో మాట తూలారు. చిరంజీవి చెప్పిన పెద్ద హీరో ఆయనే అంటే మెగాస్టార్. ఇక‌ చిన్న హీరో అంటే రవితేజ.

వాల్తేరు వీరయ్య సినిమాలో ఒక సీన్ లో గోడపై ఉన్న రవితేజ పోస్ట‌ర్ కు చిరంజీవి ముద్దాడతాడు. ఈ సీన్ ను గుర్తు చేసుకునే చిరంజీవి ఆ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు రవితేజను చిన్న హీరో అనడం పట్ల ఆయన ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న అగ్ర హీరోల్లో రవితేజ ఒక్కడు. అలాంటి రవితేజను పట్టుకుని చిన్న హీరో అని ఎలా అంటారంటూ చిరు పై మాస్ మహారాజా ఫ్యాన్స్ బగ్గుమంటున్నారు. అసలు రవితేజ పాత్ర లేకుంటే వాల్తేరు వీరయ్య సినిమా హిట్ అయ్యేదే కాదని విమ‌ర్శలు కురిపిస్తున్నారు.

Share post:

Latest