పాన్ వరల్డ్ సినిమా కోసం మహేష్.. ఏం చేయబోతున్నాడంటే..!?

‘బాహుబలి’ సినిమాలతో తెలుగు సినిమా స్థాని ప్రపంచ సినిమాల దృష్టికి తీసుకువెళ్లిన దర్శక ధీరుడు రాజమౌళి.. ఈ సినిమాల తర్వాత బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తెరకెక్కించిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా భారతీయ సినిమా స్థాయిని మరో లెవల్ కు తీసుకువెళ్లింది. ఈ సినిమా ఇప్పుడు అన్ని రికార్డులను పటాపంచలు చేస్తూ ‘ఆస్కార్’ నామినేషన్ లో కూడా ఈ సినిమాలోని ‘నాటు నాటు సాంగ్’ నామినేట్ అయింది.

ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తన తర్వాత సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ లెవెల్ లో తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాలో మహేష్ తో పాటు హాలీవుడ్ యాక్టర్స్ ని కూడా తీసుకోవడానికి రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే హాలీవుడ్ క్యాస్టింగ్ ఏజెన్సీ తో జక్కన్న ఒప్పందం కూడా చేసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చివరి దశకు వచ్చిందట. అమెజాన్ అడవుల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాలో వరల్డ్ అడ్వెంచర్ ట్రావెలర్ గా మ‌హేష్‌ కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది.

ఈ సినిమా కోసం మహేష్ బాబు కూడా తన పాత సినిమాలుకు భిన్నంగా ఎంతో ఎఫెక్ట్ కూడా పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా కోసం సుదీర్ఘ సమయం అయితే తీసుకునే అవకాశం ఉన్ననేపధ్యంలో మహేష్ దేనికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. రాజమౌళి మాత్రం బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలు కోసం తీసుకున్న సమయం కంటే తక్కువ టైంలోనే ఈ సినిమా తెరకెక్కించాలని భావిస్తున్నారట.

Sudheer Babu comments on Mahesh Babu | నేను సినిమాల్లోకి వస్తానంటే మహేష్  బాబే వద్దని వారించాడు : సుధీర్ బాబు

అయితే ఈ సినిమా కథ మొత్తం పూర్తిగా సిద్ధమైతే కాని ఎంత టైమ్ పట్టేది రాజమౌళి కూడా డిసైడ్ చేయలేరు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా కోసం మహేష్ బాబు ఏ సినిమాకి చేయని అడ్వెంచర్ విన్యాసాలు ఈ సినిమాలో చేయబోతున్నారని మహేష్- బావ సుధీర్ బాబు చెప్పుకొచ్చాడు. ఈరోజు సుధీర్ బాబు నటించిన హంట్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు సుధీర్ సమాధానం ఇచ్చారు.

రాజమౌళి- మహేష్‌తో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి మహేష్ మాత్రం ఎంతో డిఫరెంట్ మూడ్‌లో ఉన్నాడని చెప్పుకొచ్చాడు. మహేష్, జక్కన్న సినిమా కోసం త‌న‌ క్యారెక్టరైజేషన్ కోసం తన లుక్ బాడీ లాంగ్వేజ్ అన్ని కూడా మార్చుకోవడానికి సిద్ధం అవుతున్నారని తెలిపాడు.. నేను ఇంతకు ముందు ఎప్పుడు మహేష్ బాబును ఇలాంటి మూడ్‌లో చూడలేదని కూడా చెప్పుకొచ్చాడు. రాజమౌళి గారు ఈ సినిమా కోసం రేపు షూటింగ్ కి సిద్ధంగా ఉండమని చెప్తే రెడీ అనేలా మహేష్‌ ఫోకస్ అంతా కూడా ఆ సినిమా మీదే ఉందని సుధీర్ బాబు ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Share post:

Latest