టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే..కొత్త సీటు ఫిక్స్?

గత కొన్ని రోజులుగా అధికార వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్న విషయం తెలిసిందే. సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే వారి స్థానాల్లో సొంత పార్టీ నేతలతో ఆధిపత్య పోరు నడుస్తున్న పరిస్తితి. ఈ క్రమంలో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడానికి రెడీ అయ్యారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇదే క్రమంలో మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్..సొంత పార్టీపైనే అసంతృప్తిగా ఉన్నారని, ఈయన టీడీపీలోకి వస్తారని ప్రచారం ఉంది. మైలవరం సీటు కోసం మంత్రి జోగి రమేశ్ కూడా ట్రై చేస్తున్నారు. దీంతో అక్కడ జోగి వర్గం..వసంతకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇక వీరి పంచాయితీ జగన్ వద్దకు కూడా వెళ్లింది..ఇద్దరు తన వద్దకు రావాలని సూచించారు. అయితే వసంత గడపగడపకు తిరగడం మానేశారు. ఇదే క్రమంలో ఈ మధ్య టీడీపీ అనుకూలంగా మాట్లాడుతున్నారు. తాను చంద్రబాబుని విమర్శించనని, కానీ దేవినేని ఉమాని విమర్శిస్తానని, అలాగే గుంటూరు సభలో తొక్కిసలాట నేపథ్యంలో వుయ్యూరు ఫౌండేషన్ అధినేత శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడాన్ని తప్పుబట్టారు.

ఈ మధ్య పది మంది రౌడీలని వెనుకేసుకుని రాజకీయం చేసే అలవాటు లేదంటూ కామెంట్ చేశారు. కాకపోతే చివరి వరకు జగన్‌తోనే ఉంటానని అంటున్నారు..కానీ ఎక్కడో డౌట్ కొడుతుంది. ఈయన టీడీపీలోకి వస్తారనే ప్రచారం రోజురోజుకూ ఎక్కువ అవుతుంది. పైగా ఈయన మైలవరం సీటు కాకుండా జగ్గయ్యపేట సీటు ఇస్తారనే ప్రచారం కొత్తగా మొదలైంది.

మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముంది..అసలు వసంత టీడీపీలోకి వస్తారా? వస్తే ఆయనకు ఏ సీటు దక్కుతుందనేది క్లారిటీ లేదు.