రోజాపై నాగబాబు మళ్ళీ సెటైర్..లెక్క తేలుస్తారా?

నాగబాబు-రోజా..జబర్దస్త్ ప్రోగ్రాంలో అనేక ఏళ్ళు కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. అలా కలిసి పనిచేసిన వీరు ఇప్పుడు రాజకీయంగా శత్రువులుగా మారిపోయారు. ఇటీవల రోజా..చిరంజీవి, పవన్, నాగబాబు ఓటములపై సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. దానికి నాగబాబు వెంటనే కౌంటర్లు ఇచ్చారు..ముందు రోజా తన పర్యాటక శాఖని ఎలా ముందుకు తీసుకురావాలో ఆలోచించాలని ఫైర్ అయ్యరు. ఆ వెంటనే రోజా సైతం నాగబాబుపై విరుచుకుపడ్డారు. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది.

అటు ఆలీ సైతం జగన్ ఆదేశిస్తే పవన్‌పై పోటీ చేస్తానని ప్రకటించడంపై కూడా పెద్ద ఎత్తున ఆలీపై సెటైర్లు వచ్చాయి. నాగబాబు సైతం ఆలీ గురించి స్పందించడం టైమ్ వేస్ట్ అన్నట్లు చెప్పేశారు. ఇదే సమయంలో తాజాగా రోజాపై మళ్ళీ సెటైర్ వేశారు. అనంతపురంలో పార్టీ నేతల సమావేశంలో పాల్గొన్న నాగబాబు.. మంత్రి రోజా గురించి మాట్లాడటం అంటే తమ స్థాయి తగ్గించుకోవటమేనంటూ చెప్పుకొచ్చారు.

అలాగే ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని, ప్రతిపక్షాలను అడ్డుకోవటం కోసమే జీవో నెంబర్ 1 తీసుకొచ్చిందని విమర్శించారు. ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలను అడ్డుకోవటానికి ప్రతిపక్షాలు అన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని అన్నారు.

అటు పొత్తుల గురించి పవన్ కల్యాణ్ చూసుకుంటారని, ఓ వ్యూహం ప్రకారం ముందుకెళ్తారని నాగబాబు చెప్పుకొచ్చారు. అదే సమయంలో తాము బీజేపీతో కలిసే ఉన్నామని అన్నారు. ఇక రాష్ట్రంలో జనసేన బలం పెరిగిందని చెప్పారు. మొత్తానికి నాగబాబు రోజాని వదలకుండా సెటైర్లు వేస్తున్నారు.

Share post:

Latest