పెద్ద హీరోలు అయితే అది ప‌ట్టించుకోను.. మృణాల్ అలా అనేసిందేంటి?

మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసింది. గత ఏడాది `సీతారామం` సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్క‌ర్ సల్మాన్ హీరోగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమాతో మృణాల్ టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారింది. ప్రస్తుతం ఈ అమ్మ‌డు తెలుగులో నాని కి జోడిగా ఓ సినిమా చేస్తోంది. అయితే ఇటీవల ఓ మెగా హీరో సినిమాను మృణాల్ రిజెక్ట్ చేసిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తాజా ఇంటర్వ్యూలో మృణాల్ తేల్చేసింది.

తన వద్దకు ఏ మెగా హీరో సినిమా రాలేదని పేర్కొంది. అంతేకాదు పెద్ద హీరోలతో నటించే అవకాశం వచ్చినప్పుడు కథ ను పెద్దగా పట్టించుకోనని షాకింగ్ కామెంట్స్‌ చేసింది. కథతో పనిలేదని.. స్టార్ హీరోల‌తో నటించడమే తనకు ముఖ్యమని మృణాల్ చెప్పకనే చెప్పేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక తెలుగులో ఏడాదికి మూడు సినిమాలు చేయాలని అనుకుంటున్న‌ట్లు కూడా మృణాల్‌ తెలిపింది. అలాగే ఇతర భాషల్లోనూ నటిస్తానని ఆమె పేర్కొంది.

Share post:

Latest