ప‌ట్టుచీర‌లో క‌ట్టిప‌డేసిన మృణాల్‌.. ఎంత అందంగా ఉందో చూశారా?

మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ లో వరస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ‌.. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరవైంది.

హ‌ను రాఘ‌వ‌పూడి దర్శకత్వంలో దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా యుద్ధ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ ప్రేమ కథ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో సీతామహాలక్ష్మి పాత్రలో మృణాల్ అద‌ర‌గొట్టేసింది.

ఈ మూవీ తో మృణాల్ ఓవర్ నైట్ స్టార్ గా మారింది. ప్రస్తుతం తెలుగులో న్యాచురల్ స్టార్ నానికి జోడిగా ఓ సినిమా కోసం చేసింది. అలాగే బాలీవుడ్ లో ప‌లు ప్రాజెక్ట్ ల‌ను సైన్ చేసిన‌ట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక‌పోతే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే మృణాల్.. త‌ర‌చూ గ్లామ‌ర‌స్‌ ఫోటోషూట్లతో కుర్ర‌ కారుకు నిద్ర పట్టకుండా చేస్తుంటుంది. అయితే తాజాగా మాత్రం పట్టుచీరలో అందంగా ముస్తాబై దర్శనం ఇచ్చింది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ మోడ్ర‌న్ దుస్తుల్లో మెరిసే ఈ భామ‌.. తాజాగా చీరలో తనదైన అంతంత కట్టిపడేసింది. మృణాల్ లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.

Share post:

Latest