వసంత మళ్ళీ క్లారిటీ..ఇంకా సైడ్ అయినట్లే.!

ఈ మధ్య కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు…సొంత పార్టీ తీరుపైనే విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తమ ప్రభుత్వం అనుకున్న విధంగా పనిచేయలేకపోతుందని, అభివృద్ధి లేదంటూ మాట్లాడుతున్నారు. ఇదే క్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సైతం ఊహించని కామెంట్స్ చేస్తున్నారు. ఆ మధ్య తాను చంద్రబాబుని తిట్టనని అని చెప్పుకొచ్చారు. ఇక గుంటూరు సభలో తొక్కిసలాట జరగడంపై..వుయ్యూరు ఫౌండేషన్ అధినేత శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడం సరికాదని, ఆయన మంచి పనులు చేస్తున్నారని వసంత చెప్పుకొచ్చారు.

ఇక తాజాగా ఎమ్మెల్యేగా ఎందుకు ఉన్నానని బాధపడుతున్నానని, 55 ఏళ్లుగా తమ కుటుంబం రాజకీయాల్లో ఉందని, అప్పటితో పోలిస్తే ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయని, 10 మంది రౌడీలని వెంటేసుకుని తిరగడం చేతకాదని వ్యాఖ్యానించారు. అలాగే మూడున్నర ఏళ్లలో ఎవరిపైనా అక్రమ కేసులు పెట్టలేదని, కొందరు తనపై అసంతృప్తిగా ఉండవచ్చని చెప్పారు. అంటే టీడీపీ శ్రేణులపై ఎలాంటి అక్రమ కేసులు పెట్టలేదని వసంత పరోక్షంగా చెప్పుకొచ్చారు.

దీని బట్టి చూస్తే వసంత టీడీపీ శ్రేణులని సైతం మచ్చిక చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే మైలవరం వైసీపీలో వసంతకు పోటీగా మంత్రి జోగి రమేష్ ఉన్నారు. మైలవరం సీటు దక్కించుకోవాలని జోగి చూస్తున్నారు. దీంతో వసంతకు సీటు డౌట్ అని తెలుస్తోంది. అందుకే ఆయన గడపగడప కూడా తిరగడం ఆపేశారని తెలిసింది.

ఇక ఈయన టీడీపీలోకి వస్తారని ప్రచారం ముమ్మరం అయింది. కానీ టీడీపీలోకి వచ్చినా మైలవరం సీటు దక్కుతుందనే గ్యారెంటీ లేదు..ఎందుకంటే మైలవరంలో దేవినేని ఉమా ఉన్నారు. ఆయన్ని కాదని సీటు వేరే వాళ్ళకు ఇవ్వడం సాధ్యమయ్యే పని కాదు.మరి చూడాలి వసంత రాజకీయం ఎలా ఉంటుందో.