తెలివి తక్కువ సమాధానంతో మిస్ యూనివర్స్ టైటిల్ కోల్పోయిన మహేష్ బాబు భార్య..?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ గురించి స్పెషల్ గా ఇంట్రో అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ మహారాష్ట్ర కుటుంబం నుంచి వచ్చింది. 1998లో హిందీ సినిమాల్లోకి మొదటగా అడుగు పెట్టింది. అంతకుముందు మోడలింగ్ కెరీర్‌లో కొనసాగింది. అందాల పోటీల్లో కూడా పాల్గొంది. ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ 1993, ఫెమినా మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ 1993 పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. ఆ తర్వాత మిస్ యూనివర్స్ 1993లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఈ పోటీల్లో ఈ ముద్దుగుమ్మ ఆరవ స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఆమె ఒక ప్రశ్నకు తెలివి తక్కువగా చెప్పిన ప్రశ్న వల్లే మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకోలేకపోయిందని నెటిజన్లు ఇప్పుడు ఒక చర్చకు తెర లేపారు.

ప్రస్తుతం ఈ మాజీ నటి మిస్ యూనివర్స్ ఓల్డ్ వీడియో రెడిట్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో క్లిప్‌లో పెద్ద ఇయర్‌రింగ్స్, గోల్డెన్ కలర్ గౌనులో నమ్రతా శిరోద్కర్ చాలా అందంగా కనిపించింది. ఆ అందాల పోటీలో ప్రశ్నల రౌండ్‌లో ఆమె ఒక ప్రశ్నకు సమాధానం చెప్పినట్లు ఈ వీడియోలో కనిపించింది. నమ్రతను ‘మీరు శాశ్వతంగా బతికే ఉండాలనుకుంటున్నారా’ అని నిర్వాహకులు అడిగారు. దానికి ఆమె ‘ఎవరూ శాశ్వతంగా జీవించలేరని నమ్ముతున్నందున శాశ్వతంగా జీవించాలని కోరుకోవడం లేద’ని సమాధానమిచ్చింది.

ఆమె ఆన్సర్‌కి న్యాయనిర్ణేతలు ఇంప్రెస్స్ కాలేదు. ఈ జవాబుతో ఆమె మిస్ యూనివర్స్ కిరీటాన్ని చేజార్చుకుంది. మిస్ యూనివర్స్ 1993లో ఆమె ఆరో స్థానంలో నిలిచింది. ఒక ఊహాత్మక ప్రశ్నకు చాలా క్రియేటివ్‌గా, ఆకట్టుకునేలా సమాధానం ఇవ్వాలి కానీ అది సాధ్యం కాదని రియల్ లైఫ్‌తో ముడి పెడుతూ సాధారణ ఆన్సర్ ఇవ్వడమే ఆమె చేసిన పెద్ద తప్పు అని కొందరు అంటున్నారు. తను ఎప్పటికీ జీవించాలనుకుంటే ఎస్ అని సమాధానం చెప్పాలి. లేదంటే నో అని సమాధానం చెప్పాలి. ఆ సమాధానం ఇందుకు చెప్పామో కూడా వివరించాలి. కానీ అవి ఏమీ లేకుండా అసలు సరైన సమాధానమే ఇవ్వకుండా నమ్రత తప్పు చేసిందని మరికొందరు అంటున్నారు.

‘లేదు, నేను శాశ్వతంగా జీవించడానికి ఇష్టపడను, ఎందుకంటే ఏదైనా అతిగా ఉంటే అది అనర్థంగా ఉంటుంది, మనమందరం ఒక కారణం కోసం ఇక్కడకు వచ్చామని నేను నమ్ముతున్నా. ఆ తర్వాత భూమిపై మరొక జీవికి చోటు కల్పించడం ధర్మం’ అని చెప్పినట్లయితే బాగుండేదని మరో యూజర్ కామెంట్ చేశాడు. ఏదేమైనా 30 ఏళ్ల క్రితం జరిగిపోయిన దాన్ని ఇప్పుడు తవ్వి ఆమెను నెటిజన్లు విమర్శించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.