NTR -30 వ చిత్రానికి కొరటాల రేమ్యునరేషన్ అన్ని కోట్లా..?

టాలీవుడ్ లో డైరెక్టర్ కొరటాల శివ తీసిన సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో అందరికీ తెలుసిన విషయమే.. కేవలం ఆచార్య సినిమాతో ఊహించని విధంగా దెబ్బ పడింది. ఇంతకు ముందు వరకు సినిమాలు సక్సెస్ అయ్యాయి కాబట్టి బిజినెస్ విషయంలో ఎన్ని సార్లు తలదూర్చిన కొరటాలకు ఇబ్బంది ఏమి రాలేదు. కానీ ఆచార్య సినిమా ఫ్లాప్ కావటంతో సినిమాకు దారుణంగా నష్టాలు వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ శివ చెప్పినట్టు తను అడిగినంత ఇచ్చి కొనుగోలు చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా శివ ఇందులోనే ప్రాఫిట్ కూడా తీసుకోవాలని అనుకుంటున్నాడు.

Koratala Siva On His Collaboration With Jr NTR For 'NTR30': "There Will Be  A Mass Overdose"
అయితే ఇక్కడ ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఆచార్య సినిమాతో ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్స్ తో చర్చలు జరిపి వారికి సెటిల్మెంట్స్ చేయాల్సి వచ్చింది. అయితే కొరిటాల ఆ తప్పులు చేయకుండా ఇప్పుడు రాబోయే ఎన్టీఆర్ సినిమాకు సైలెంట్ గా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాంటి బిజినెస్ వ్యవహారాలోకి ఇన్వాల్వ్ కాకూడదని నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా సమాచారం. కొరటాల శివ ,ఎన్టీఆర్ సినిమాకు దాదాపు రూ.22 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా సంక్రాంతి తరువాత మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.. ఈ సినిమాని వచ్చే సంవత్సరానికి పూర్తి చేసి ఏప్రిల్ మొదట్లోనే విడుదల చేయాలని ఒక ప్రాణాలికను సిద్ధం చేసుకున్నారు.

కొరటాల శివ ఈ సినిమాను చేయడానికి చాలా ఆలోచించి అలాగే చాలా సమయం తీసుకుని స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని అలాగే ఎన్టీఆర్ స్క్రిప్ట్ విషయంలో ఎంతగానో ఒత్తిడి తీసుకొచ్చాడు. కాస్త ఆలస్యమైనప్పటికీ ఈ సినిమాని భారీ స్థాయిలో తెరపైకి తీసుకురావాలని డిసైడ్ అయ్యాడు కొరటాల శివ. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి. ఈ సినిమా 2024 ఏప్రిల్ లో విడుదల కాబోతోంది.