చీరాల సీటు కరణం వారసుడుకే..టీడీపీ నిలువరిస్తుందా?

మొత్తానికి చీరాల సీటు విషయంలో దాదాపు క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది..మొన్నటివరకు ఈ సీటు కోసం ఇటు కరణం బలరాం, అటు ఆమంచి కృష్ణ మోహన్‌ల మధ్య పోరు నడిచిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆమంచిని పర్చూరు ఇంచార్జ్ గా పంపారు. దీంతో చీరాలలో కరణంకు రూట్ క్లియర్ అయింది. ఈ సీటుని కరణం వారసుడు వెంకటేష్‌కు ఫిక్స్ చేస్తున్నారని తెలిసింది. తాజాగా  వెంకటేష్ పేరును వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బీదా మస్తాన్ రావు ప్రకటించారు.

అటు ఎమ్మెల్సీ పోతుల సునీత సైతం..కరణంకు సపోర్ట్ చేసినట్లు తెలిసింది. ఇక ఆమెకు ఎమ్మెల్సీ హామీతో…చీరాల సీటులో కరణం ఫ్యామిలీకి సపోర్ట్ చేయనున్నారు. ఇలా చీరాల సీటుని ఫిక్స్ చేశారు. అటు ఆమంచికి పర్చూరు సీటు ఖాయమనే అంటున్నారు. అయితే లాస్ట్ మినిట్ లో ఏమైనా మార్పులు జరిగితే చెప్పలేం. ఎందుకంటే ఆమంచికి చీరాలపైనే ఫోకస్ ఉంది. 2009, 2014 ఎన్నికల్లో ఆయనే వరుసగా గెలిచారు. 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

కానీ అప్పుడు టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం వైసీపీలోకి రావడంతో అసలు రచ్చ మొదలైంది. అయితే ఆమంచిని ఈ మధ్య పర్చూరుకు పంపడంతో కాస్త పరిస్తితులు చక్కబడ్డాయి. ఈ నేపథ్యంలోనే వెంకటేష్‌కు చీరాల సీటు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మరి చీరాల సీటులో కరణం వెంకటేష్‌కు టీడీపీ గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. పైగా టీడీపీ-జనసేన పొత్తు ఉండనుంది..దీంతో కరణంకు ఇంకా రిస్క్ పెరిగే ఛాన్స్ ఉంది.

అలాగే ఇక్కడ టీడీపీ పోటీ చేస్తుందా? జనసేన పోటీ చేస్తుందా? అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఏదేమైనా రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే వైసీపీకే రిస్క్.