కాజల్ అగర్వాల్ మళ్ళీ వచ్చేస్తుందోచ్.. కేక పెట్టించే కాంబినేషన్ రెడీ..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ అగ్ర హీరోలకు జంటగా నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో ఉన్న సీనియర్, జూనియర్ అనే బేధం లేకుండా అందరి హీరోలతో నటించింది.

Kajal Aggarwal shares FIRST family portrait ft. son Neil to wish husband  Gautam Kitchlu on his birthday | Celebrities News – India TV

ఇక పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లియింది.. ప్రస్తుతం సినిమాలుకు దూరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు టాలీవుడ్‌కు మళ్లీ రియంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. టాలీవుడ్‌లో ఓ సీనియర్ స్టార్ హీరో సినిమాలో కాజల్ పేరు హీరోయిన్ గా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ సినిమాలో ఈమె కన్ఫర్మ్ అయితే మళ్లీ తెలుగులో కాజల్ సినిమాలు మొదలవుతాయి. అసలే టాలీవుడ్ సీనియర్ హీరోలు వారికి హీరోయిన్లు దొరక ఇబ్బంది పడుతున్నారు.

Actress kajal aggarwal looks stunningly beautiful in this pictures |  Actress Kajal Aggarwal Looks Stunningly Beautiful In This Pictures -  Actresskajal, Kajal Aggarwal

టాలీవుడ్ సీనియర్ హీరోలు కూడా యువ హీరోలకు పోటీ ఇచ్చే విధంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందువల్ల ఇప్పుడు కాజల్ వ‌స్తే చకచకా అవకాశాలు వస్తాయని చెప్పడంలో సందేహం లేదు.
ఇప్పటికే కొందరు సీనియర్ హీరోయిన్లు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు కానీ హీరోయిన్లుగా మాత్రం కాదు. అమ్మ పాత్రలు, అక్క పాత్రలు, స్పెషల్ రోల్స్ చేస్తున్నారు. కాజల్ మాత్రం హీరోయిన్ గానే ఎంట్రీ ఇవ్వబోతుంది.ఈమే రీఎంట్రీలో ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.