ఎన్టీఆర్ ఎక్కువ సార్లు రొమాన్స్ చేసిన హీరోయ‌న్లు వీళ్లే… ఎవ‌రు ల‌క్కీ హీరోయిన్ అంటే..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం తన కెరీర్ లోనే ఎప్పుడు లేనంత పుల్ జోష్‌లో ఉన్నాడు. 2015లో వ‌చ్చిన టెంప‌ర్ సినిమా నుంచి గ‌త‌ ఏడాది వ‌చ్చిన RRR సినిమా వ‌ర‌కు వ‌ర‌స‌గా 6 సూప‌ర్ హిట్‌ల‌తో డ‌బుల్ హ్యాట్రిక్ హిట్‌ కొట్టాడు. ప్ర‌స్తుతం కొర‌టాల శివ‌, ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రెండు భారీ క్రేజి పాన్ ఇండియా సినిమాల‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. 20 సంవ‌త్స‌రాల త‌న కెరీర్‌లో 30 సినిమాల‌లో న‌టించిన ఎన్టీఆర్ త‌న కెరీర్‌లో కొంద‌రు హీరోయిన్స్‌తో రిపీటెడ్‌గా న‌టించాడు. ఆ హీరోయిన్స్ ఎవ‌రో ?వీళ్ల‌లో ఎవ‌రు ? ఎన్టీఆర్‌కు క‌లిసి వ‌చ్చిన ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో చూద్దాం.

గ‌జాలా : స్టూడెంట్ నెంబ‌ర్ 1, అల్ల‌రి రాముడు.. ఎన్టీఆర్ మొద‌టి హిట్ సినిమా స్టూడెంట్ నెంబ‌ర్ 1లో న‌టించ‌న గ‌జాలా .. ఆ త‌ర్వాత మారోసారి బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అల్ల‌రిరాముడు సినిమాలో కూడా న‌టించింది. గ‌జాలా న‌టించిన ఈ రెండు సినిమాలు సూప‌ర్ హిట్‌ అయ్యాయి. స్టూడెంట్ నెంబ‌ర్ 1 రాజామౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చి ఎన్టీఆర్‌కు యూత్‌లో తిరుగులేని క్రేజ్ తీసుకు వ‌చ్చింది. అలాగే అల్ల‌రి రాముడు క‌మార్షియ‌ల్‌గా హిట్‌ అయింది.

భూమిక : సింహాద్రి, సాంబ.. భూమిక, ఎన్టీఆర్‌తో రాజామౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో పాటు సాంబ సినిమాలోను న‌టించింది. ఈ రెండు సినిమాల‌లో సింహాద్రి ఇండ‌స్ట్రీ హిట్ కాగా.. సాంబ బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచింది.

జెనీలీయా : నందమూరి హీరో తో రెండు సార్లు జతకట్టింది ఈ ముద్దుగుమ్మ.నా అల్లుడు అనే సినిమాలో ఎన్టీఆర్ తో చేసిన ఈ ముద్దుగుమ్మ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన సాంబ సినిమాలో హీరోయిన్ గా నటించింది. నా అల్లుడు సినిమా డిజాస్టర్ గా మిగిలింది.సాంబా మాత్రం హిట్ అయ్యింది.

Telugu Aarti Agarwal, Bhoomika, Gajala, Genelia, Ileyana, Ntr, Ntr Lucky, Kajal

ఇలియానా : రాఖీ, శ‌క్తి.. బ‌క్క‌ప‌ల‌చ‌ని భామ ఇలియానా కూడా ఎన్టీఆర్ తో రెండు సినిమాలు చేసింది. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన శ‌క్తి ఘెర‌మైన డిజాస్ట‌ర్ కాగా… కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రాఖీ సినిమా హిట్ గా నిలిచింది. ఇలాయానాతో చేసిన రెండు సినిమాల్లో ఒక‌టి హిట్‌.. మ‌రొక‌టి ఫ‌ట్ అయ్యాయి.

స‌మీరారెడ్డి : అశోక్‌, న‌ర‌సింహుడు… తెలుగు అమ్మ‌యి స‌మీరా రెడ్డి ఎన్టీఆర్ తో అశోక్‌, న‌ర‌సింహుడు సినిమాల‌లో న‌టిచింది. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద ప్లాప్‌గా నిలిచాచయి. ఎన్టీఆర్‌కు ఏ హీరోయిన్‌తోను గాసిప్పులు రాలేదు… కాని స‌మీరా రెడ్డి విష‌యంలో మాత్రం ఎన్టీఆర్ గాసిప్పులు ఎదుర్కోవాల్పి వ‌చ్చింది. పైగా ఇటు ఆమెతో చేసిన సినిమాలు క‌లిసి రాలేదు.

Telugu Aarti Agarwal, Bhoomika, Gajala, Genelia, Ileyana, Ntr, Ntr Lucky, Kajal

స‌మంత‌: బృందావ‌నం, జ‌న‌తా గ్యారేజ్‌, రామ‌య్యా వ‌స్తావ‌య్యా, ర‌భ‌స… ఎన్టీఆర్‌కు క‌లిసి వ‌చ్చిన హీరోయిన్ల‌లో స‌మంత కూడా ఒక‌రు. స‌మంత‌తో తార‌క్ నాలుగు సినిమాల‌లో న‌టించారు. బృందావ‌నం, జ‌న‌తాగ్యారేజ్ హిట్ సినిమాలు కాగా. రామ‌య్య వ‌స్తావ‌య్యా, ర‌భ‌స మాత్రం అంచనాలు అందుకోలేక ఫ్లాప్ అయ్యాయి.. ఎన్టీఆర్ త‌న కెరీర్‌లో ఒక హీరోయిన్‌తో నాలుగు సినిమాల‌లో న‌టించిన ఘ‌న‌త కూడా స‌మంత‌కు మత్ర‌మే ద‌క్కింది.

Telugu Aarti Agarwal, Bhoomika, Gajala, Genelia, Ileyana, Ntr, Ntr Lucky, Kajal

ఆర్తీ అగ‌ర్వాల్‌: అల్ల‌రి రాముడు, న‌ర‌సింహుడు స్పెష‌ల్ సాంగ్… అప్ప‌ట్లో ఒక ఊపు ఊపేసిన దివంగ‌త ఆర్తీ అగర్వాల్ అల్ల‌రి రాముడులో మెయిన్ హీరోయిన్ కాగా.. న‌ర‌సింహుడు సినిమాలో స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించింది. అల్ల‌రి రాముడు క‌మ‌ర్షియ‌ల్‌ హిట్‌కాగా… న‌ర‌సింహుడు బాక్సాఫీస్ వ‌ద్ద ప్లాప్ అయింది.

Telugu Aarti Agarwal, Bhoomika, Gajala, Genelia, Ileyana, Ntr, Ntr Lucky, Kajal

కాజ‌ల్ అగ‌ర్వాల్ : బృందావ‌నం, టెంప‌ర్‌, బాద్‌షా… ఇక ఎన్టీఆర్‌కు బాగా క‌లిసి వ‌చ్చిన హీరోయిన్ ఎవ‌రు ? అంటే క‌చ్చితంగా కాజ‌ల్ అనే చెప్పాలి. ఎన్టీఆర్ తో బృందావ‌నం, టెంప‌ర్‌, బాద్‌షా సినిమాలు చేస్తే మూడు సూప‌ర్ హిట్ అయ్యాయి. కాజ‌ల్‌తో ఎన్టీఆర్‌కు ఒక్క‌ ప్లాప్ సినిమా కూడా లేదు. కాజ‌ల్ ఆ త‌ర్వాత స‌మంత ఎన్టీఆర్‌కు ల‌క్కీ హీరోయిన్‌ అని చెప్పాలి.

Share post:

Latest