హీరోయిన్ జమున రాజకీయాలలోకి వెళ్లడానికి కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి నిన్నటి రోజున డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ మరణించారు అనే వార్తలు వినిపించాయి… ఈ రోజున సీనియర్ నటి జమున కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం ఈమె హైదరాబాదులో తన నివాసంలో తృది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. జమున మృతితో టాలీవుడ్ మళ్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడుతోంది. ఈమె అభిమానులు సినీ ప్రముఖుల సైతం తీవ్ర విషాదంతో మునిగిపోతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయకులుగా కొనసాగిన వారు ఎందరో ఉన్నారు.

Jamuna | Retro bollywood, Beautiful indian actress, Retro images
అయితే అలాంటి వారిలో నటనపరంగా ప్రతిభ కరంగా పేరు సంపాదించిన వారిలో జమున కూడా ఒకరు. జమున 1937లో కర్ణాటక రాష్ట్రంలోని హంపి లో జన్మించింది. ఇక ఈమె కుటుంబ సభ్యులు ఆంధ్రకు వెళ్లడంతో గుంటూరులో స్థిరపడ్డారు. జమున చదువుకునే రోజులలోనే నాటకాల పైన మక్కువ ఉండటంతో ఆమె పలు నాటకాలలో పాల్గొంటూ ఉండేది అలా ఒకసారి నటుడు జగ్గయ్య గుంటూరు ప్రాంతానికి చెందిన నటుడు కావడంతో ప్రత్యేకంగా జమునను ఒక నాటకలంలో ఎంపిక చేయడం జరిగింది. ఆ తర్వాత ఆమె ప్రతిభ పాపులర్ కావడంతో సినిమాలో ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి.

Remembering the legacy of Indira Gandhi | Mintఅలా ఇమే పుట్టినిల్లు సినిమాతో మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.ఆ తర్వాత ఎంతోమంది హీరోలతో నటించింది. సత్యభామ పాత్ర పోషించడంతో ఈమె మంచి పాపులారిటీ. ఈమె తెలుగు తమిళ్ హిందీ వంటి భాషలలో కూడా నటించింది సినిమాలలో మంచి విజయాలు అందుకుంటున్న సమయంలోనే దివంగత ఇందిరా గాంధీ పట్ల అభిమానం గౌరవంతో ఈమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది జమున.