నాలుగు హిట్లు కొట్టగానే కన్నడ సినిమా వారికి కళ్లు నెత్తికెక్కాయా..?

 

కన్నడ ఇండస్ట్రీ అనగానే మొదటిగా గుర్తు వచ్చేది కేజీఎఫ్ సినిమా. అప్పటివరకు అట్టడుగున్న ఉన్న కన్నడ పరిశ్రమని ఒక లెవెల్‌కి తీసుకొచ్చిన సినిమా ఏది అంటే కేజీఎఫ్ అనే చెప్పాలి. ఆ తరువాత వచ్చిన సినిమాలు వరుసగా విజయాన్ని అందుకుంటున్నాయి. అంతే ఇక అప్పటినుండి కన్నడ ప్రేక్షకులు కాస్త లెవెల్ చూపిస్తున్నారు. నాలుగు సినిమాలు హిట్ అయ్యేసరికి కన్నడ అభిమానుల కళ్లు నెత్తికెక్కేసాయి . దాంతో కన్నడ మీద ఉన్న అభిమానం ఎదుటి ఇండస్ట్రీలపై ద్వేషంగా మారుతుంది. ఈ విషయంలో మాత్రం మన తెలుగు ప్రేక్షకులను అభినందించవచ్చు.

కన్నడ సినిమా అయిన కేజీఫ్ కి మంచి హిట్ అందించారు. కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణిస్తే మన తెలుగు వారు కంట తడి పెట్టారు. ఇక కాంతార సినిమాను ఎంతగానో అభిమానించారు. మన తెలుగువారు కన్నడ ఇండస్ట్రీని మనలో కలుపుకుని చూస్తారు. కానీ మనం భావించినట్లుగా కన్నడ వాళ్ళు అనుకోవడం లేదు. వారికంటే గొప్పవారు ఎవరు లేరనట్లు చేస్తున్నారు. కన్నడ ట్రోలర్లు ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ని విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు. ఏదో ఒక విషయంలో ప్రశాంత్ నీల్ తప్పులు వెతికి మరీ విమర్శిస్తున్నారు.

నిజానికి కన్నడ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఇలా ఉండేది కాదు. ఎపుడైతే కేజీఎఫ్ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో హిట్ అయిందో ఇక అప్పటినుండి వారికీ కళ్లు నెత్తికెక్కేసాయి. కేజీఎఫ్ -2 సినిమా తరువాత ఇప్పుడు ప్రశాంత్ నీల్ డార్లింగ్ ప్రభాస్ ని హీరో గా తీసుకొని సలార్ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా ని హోంబోలే ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ మధ్యలో ఉంది. ఈ సినిమా అయిపోయాక ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్లో సినిమా తీయబోతున్నాడు. అయితే ప్రశాంత్ నీల్ కన్నడ హీరోలను వదిలేసి కేవలం తెలుగు ఇండస్ట్రీ వైపు వెళ్తున్నాడనేది కన్నడ అభిమానులకు కోపం తెప్పించింది.

నిజానికి ప్రశాంత్ నీల్ తెలుగువాడు. అతను మాజీ మంత్రి రఘువీరారెడ్డి కుటుంబానికి చెందినవాడు. అయితే ప్రశాంత్ కి తన స్వగ్రామమైన నీలకంఠాపురంపై అభిమానంతో తన పేరు చివర నీల్ అని పెట్టుకున్నాడు. ఇక ఈ విషయాలన్నీ ప్రశాంత్ నీల్ పై కన్నడ వారికీ కోపాన్ని తెప్పిస్తున్నాయి. ఈ మధ్య కేజీఎఫ్ హీరో యష్ పుట్టినరోజు కావడంతో ప్రశాంత్ నీల్ అతనికి విషెస్ తెలిపాడు. దాంట్లో కూడా కూడా కన్నడ వాళ్ళు తప్పు వెతికి ప్రశాంత్ నీల్ ని ట్రోల్ చేశారు. అవన్నీ చూసి ప్రశాంత్ నీల్ కి విసుగొచ్చి తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిటిని రద్దు చేసుకున్నాడు. అసలు ఈ గోల అంత హీరోయిన్ రష్మిక దగ్గర నుంచి మొదలయిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.