లోకేష్ పాదయాత్రపై కన్ఫ్యూజన్..పర్మిషన్లలో చిక్కులు.!

నారా లోకేష్ పాదయాత్ర పర్మిషన్ల విషయంలో క్లారిటీ లేకుండా పోయింది…ఇప్పటికే జనవరి 27న కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర మొదలుకానున్న విషయం తెలిసిందే..దీనికి సంబంధించిన ఏర్పాట్లని సైతం పూర్తి చేసే పనిలో టీడీపీ శ్రేణులు ఉన్నాయి. అయితే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం1 వల్ల లోకేష్ పాదయాత్రకు కొన్ని అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే లోకేష్ పద్యతరకు పర్మిషన్ ఇవ్వాలని ఇప్పటికే పలుమార్లు ఏపీ డి‌జి‌పికి, చిత్తూరు ఎస్పీకి, కుప్పం పోలీసులకు  లేఖ రాశారు.

అయితే తాజాగా డి‌జి‌పి నుంచి టీడీపీకి రిప్లై వచ్చింది. కాకపోతే పర్మిషన్ ఇచ్చే విషయంలో కొన్ని లింకులు పెట్టారు. పాదయాత్రకు ఎవరెవరు వస్తారు..ఏ వెహికల్స్ వస్తాయనే అంశాలపై ప్రశ్నలు సంధించారు. ఇక దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య సైతం స్పందిస్తూ.. లోకేశ్‌ పాదయాత్ర రూట్‌ మ్యాప్‌, కాన్వాయ్‌ వెహికల్‌ లిస్టు అడిగారని, వాటిని ఇస్తామని, కానీ లోకేశ్‌ను ఎవరెవరు కలుస్తారనేది ముందుగా ఎలా చెప్పగలమని వర్ల రామయ్య అన్నారు.

పాదయాత్రలో ఎవరెవరిని కలుస్తారు? ఎన్ని కార్లు వస్తాయి? ఎవరెవరు పాల్గొంటారు? అంటూ డీజీపీ లేఖ రాయడం సరికాదని టీడీపీ నేతలు అంటున్నారు. పాదయాత్రకు ముందే ఎంత మంది వస్తారు? ఎన్ని కార్లు వస్తాయి? వాటి వివరాలు ఇమ్మంటే సాధ్యమా? అని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రశ్నించారు. ఇక లోకేశ్‌ పాదయాత్ర కోసం ప్రజలు ఎదురుచూస్తుంటే.. యువగళాన్ని ఆపాలని జగన్‌రెడ్డి, కసిరెడ్డి కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. ‘ఆయన డీజీపీ కాదు… కసిరెడ్డే!’ అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్వీట్‌ చేశారు.

ఇలా డి‌జి‌పి, జగన్‌లపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. మరి లోకేష్ పాదయాత్ర సజావుగా సాగుతుందో లేదో చూడాలి.