గుంటూరు టీడీపీలో కన్ఫ్యూజన్..ఏ సీటు ఎవరికి?

ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలపడుతుంది..వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవాలని టి‌డి‌పి చూస్తుంది. దీంతో గెలుపు కాస్త ఈజీ కావడంతో గుంటూరులో పలు సీట్లకు డిమాండ్ పెరిగింది. సీట్ల కోసం పోటీ పెరిగింది. ఇప్పటికే సత్తెనపల్లి, గుంటూరు వెస్ట్, తాడికొండ లాంటి సీట్లలో ఇద్దరు, ముగ్గురు నేతలు ఉన్నారు. ఇదే క్రమంలో తన వారసుడుకు సీటు ఇవ్వాలని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు డిమాండ్ చేశారు.

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని రాయపాటి తేల్చేసిన విషయం తెలిసిందే. అయితే తన వారసుడు రంగరావుకు సత్తెనపల్లి గాని, నరసారావుపేట లేదా గుంటూరు వెస్ట్ సీటు ఇవ్వాలని అంటున్నారు. లేదంటే నరసారావుపేట ఎంపీ సీటు ఇవ్వాలని అడుగుతున్నారు. అయితే నరసారావుపేట ఎంపీ సీటు పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు మహేశ్‌కు ఫిక్స్ అయిందని తెలుస్తోంది. అటు సత్తెనపల్లి సీటు జనసేనకు ఇస్తారనే ప్రచారం ఉంది. ఇటు గుంటూరు వెస్ట్ సీటులో ఇప్పటికే కోవెలమూడి రవీంద్ర, భాష్యం ప్రవీణ్, మన్నవ మోహన కృష్ణ లాంటి వారు పోటీ పడుతున్నారు.

ఇక నరసారావుపేట అసెంబ్లీలో డాక్టర్ అరవింద్ బాబు ఉన్నారు. ఇలా సీట్లలో పోటీ ఉంది. అయితే వీటిల్లో నరసారావుపేట అసెంబ్లీ ఒక్కటే ఛాన్స్ ఉంది..అక్కడ ఎలాగో అరవింద్ బాబు ఎఫెక్టివ్ గా పనిచేయట్లేదని అంటున్నారు. కాబట్టి రాయపాటి వారసుడుకు ఆ సీటు ఇచ్చే ఛాన్స్ ఉంది. కానీ అది కూడా క్లారిటీ లేదు.

అయితే తన వారసుడుకు సీటు అడిగిన రాయపాటి..తాడికొండ సీటు తోకల రాజవర్దన్ రావుకు అడుగుతున్నారు. అక్కడ అల్రీడీ తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నారు. మొత్తానికి గుంటూరు టీడీపీలో సీట్లపై క్లారిటీ లేదు.