చిరంజీవి నటించిన చిత్రాలలో ఖైదీ సినిమా ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ఈ సినిమాలో రగులుతోంది మొగలి పొద అనే పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవితో పోటీపడి ఈ సినిమాలో డాన్స్ వేసిన హీరోయిన్ మాధవి దాదాపుగా 10 సంవత్సరాల పాటు అందచందాలతో ప్రేక్షకులను అలరించింది.ఇక ఇమే చిరంజీవికి ఫేవరెట్ జోడిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి మొదట సినిమా ప్రాణం ఖరీదు తో మొదలై ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, చట్టంతో పోరాటం ,రోషగాడు, కోతల రాముడు, బిగ్ బాస్ వంటి తదితర బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించి మెప్పించింది.
ఒకవైపు గ్లామర్ సినిమాలలో నటిస్తూ మరొకవైపు మాతృదేవోభవ సినిమాలో అద్భుతమైన నటనతో అందరిని కంటతడి పెట్టించింది. అలాగే టిక్ టిక్ టిక్ సినిమాలో కూడా బికినీలో దర్శనమిచ్చి కుర్రకారుల మతులు పోగొట్టింది. ఇక చిరంజీవితో పాటు రజనీకాంత్ శోభన్ బాబు ,మిధున చక్రవర్తి ,అమితాబచ్చన్, మమ్ముట్టి ఇలా ఎంతోమంది సూపర్ స్టార్ లత నటించిన ఏమి తెలుగు తమిళ్ కన్నడ హిందీ మలయాళం వరియా భాషలలో దాదాపుగా 300కు పైగా సినిమాలలో నటించింది మాధవి. మాధవి పుట్టింది పెరిగింది హైదరాబాదులోనే.
సినిమా ఇండస్ట్రీలో సుమారుగా 17 సంవత్సరాల పాటు కొనసాగిన మాధవి అప్పటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి విజయశాంతి లకు గట్టి పోటీ ఇచ్చిందని చెప్పవచ్చు. సినిమాలలో బిజీగా ఉన్న సమయంలో బిజినెస్ మ్యాన్.. రాల్ఫ్ శర్మాను వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది వీరికి టిఫాని శర్మ , ప్రసిల్లా శర్మ, ఎవిలిన్ అనే ముగ్గురు కుమార్తెలు కలరు. కాదా పిల్లలు పెద్దయ్యాక మాధవి బిజినెస్ వైపు ఆసక్తి చూపడంతో తన భర్తతో పాటు ఆమె కూడా బిజినెస్ లు నిర్వహిస్తోందట. అలాగే పలుఫుడ్ రెస్టారెంట్ బిజినెస్ లతో రాణిస్తున్నట్లు సమాచారం.
View this post on Instagram