తండ్రి చేత‌ క‌న్నీళ్లు పెట్టించిన రామ్ చ‌ర‌ణ్‌.. త‌న‌యుడిపై చిరు కామెంట్స్ వైర‌ల్‌!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి చేత కన్నీళ్లు పెట్టించాడట. ఈ విషయాన్ని తాజాగా చిరంజీవి స్వయంగా వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామ్ చ‌ర‌ణ్ త్వ‌ర‌లోనే తండ్రి కాంబోతున్న సంగ‌తి తెలిసిందే. రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన ఇటీవల గర్భం దాల్చింది. 2012లో రామ్ చరణ్ ఉపాసన వివాహం చేసుకున్నారు.

పెళ్లయిన పదేళ్ల తర్వాత ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నారు. ఈ గుడ్‌ న్యూస్ ను ఇటీవల చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ఉపాస‌న ప్రెగ్నెంట్ అవ్వ‌డంతో మెగా కుటుంబ సభ్యులతో సహా మెగా ఫ్యాన్స్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే తాజా ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడుతూ చిరు ఆసక్తికర కామెంట్ చేశారు.

రామ్ చరణ్, ఉపాసన తల్లి తండ్రులు కాబోతున్నారన్న వార్త విని కన్నీళ్ళు ఆపుకోలేకపోయానని, సంతోషం పట్టలేక భావోద్వేగానికి లోనయ్యాన‌ని చిరు పేర్కొన్నారు. చాలా ఏళ్ళుగా తాము ఈ సందర్భం కోసం ఎదురు చూస్తున్నామ‌ని, జపాన్ టూర్ పూర్తి చేసుకుని ఇంటికి రాగానే రామ్ చరణ్, ఉపాసన.. ఈ శుభవార్త చెప్ప‌డంతో తాను, సురేఖ ఎంతో హ్యాపీగా ఫీలయ్యామ‌ని చిరు తెలిపారు. ఆ సందర్భంలో తాను కన్నీళ్లు ఆపుకోలేకపోయాన‌ని, ఇక‌ ఉపాసనకు మూడో నెల వచ్చాకే ఈ విషయాన్ని అందరితో పంచుకున్నామ‌ని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.