బాలయ్య చుట్ట సిద్ధాంతం.. అందుకే ప్ర‌తిరోజు తాగుతానంటూ ఓపెన్ కామెంట్స్‌!

నట సింహం నందమూరి బాలకృష్ణ చుట్టా తాగుతారా అంటే.. అవును తాగుతారు. ఈ విషయాన్ని ఎవరో కాదు ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు అంతేకాదు చుట్ట సిద్ధాంతాన్ని కూడా వ‌ల్లించారు. చుట్ట ఎలా తాగాలి, దాని వల్ల వ‌చ్చే లాభాం ఏంటి వంటి విష‌యాల‌ను బాల‌య్య వివ‌రించారు. తాజాగా బాల‌కృష్ణ `వీర సింహారెడ్డి` ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంట‌ర్వ్యూలో ప్ర‌తిరోజు తాను చుట్ట తాగుతానంటూ ఓపెన్ కామెంట్స్ చేశారు. నాన్నగారు చుట్ట తాగేవార‌ని, తాను కూడా ఆయన్ను ఆనుసరించి ప్రతి రోజు పొద్దున్నే మూడున్నరకు లేచి చుట్టు కాలుస్తాన‌ని, అది త‌న‌కు అల‌వాటు అని పేర్కొన్నారు బాల‌య్య‌. `వాయిస్ కు చుట్ట చాలా మంచిది. స్ట్రా నుంచి లోపలకు డ్రింక్ ఎలా తాగుతామో అలా చుట్ట పొగను లోపలకు పీల్చుకోవాలి.

అలా పొగను లోపలకు తీసుకున్నప్పుడు లంగ్స్ లో ఉన్న శ్లేష్మం అంతా బయటకు వచ్చేస్తుంది. వాయిస్ మాకు ఎంతో ముఖ్యం. డైలాగ్ చెప్పేటప్పుడు జీర వస్తే నాకు కాన్ఫిడెన్స్ పోతుంది. అందుకే రోజు చుట్ట తాగుతాను. సిగరెట్ పొగను పీల్చడం వల్ల ఆరోగ్యంకు హానికరం కానీ చుట్ట తాగడం వల్ల ఎక్కువ అనారోగ్యం కాదు.` అంటూ బాల‌య్య ఈ సంద‌ర్భంగా చెప్పుకొచ్చారు. ఇక బాలయ్య చుట్ట సిద్ధాంతం ను కొందరు తప్పుబడుతూ ఉంటే.. మ‌రికొంద‌రు మాత్రం చుట్ట వల్ల ఇంత ప్రయోజనం ఉందా అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.