సంక్రాంతి హీరోల‌కు బిగ్ షాక్ ఇచ్చిన‌ అజిత్‌.. ఈ ట్విస్ట్ అస్స‌లు ఊహించ‌లేదు!

ఈ సంక్రాంతి బ‌రిలో నాలుగు స్టార్ హీరోలు త‌ల‌ప‌డ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 12న న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌ `వీర సింహారెడ్డి`, విజ‌య్ ద‌ళ‌ప‌తి న‌టించిన `వార‌సుడు` చిత్రాలు విడుద‌ల కాబోతున్నాయి. జ‌న‌వ‌రి 13న చిరంజీవి `వాల్తేరు వీర‌య్య‌`, అజిత్ `తెగింపు` చిత్రాలు వ‌స్తున్నాయి. దీంతో సంక్రాంతి ఫైట్ ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

బ్యాక్సాఫీస్ వ‌ద్ద భారీ ఎత్తున క్లాషెస్ రాబోతున్నాయి. ఇప్ప‌టికే దిల్ రాజు త‌న నిర్మాణంలో రూపుదిద్దుకున్న `వార‌సుడు` కోసం మిగిలిన చిత్రాల‌కు థియేట‌ర్లు ద‌క్క‌కుండా చేస్తున్నాడు. ఈ విష‌యంలో దిల్ రాజును చాలా మంది త‌ప్పుబ‌డుతున్నారు. ఇలాంటి త‌రుణంలో అజిత్ సేఫ్ స్టెప్ వేసి సంక్రాంతి హీరోల‌కు బిగ్ షాక్ ఇచ్చాడు.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. డైరెక్ట‌ర్ హెచ్.వినోద్, అజిత్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ మూవీ తెగింపు(త‌మిళంలో తునివు) అనుకున్న తేదీ కంటే కాస్త ముందుగానే వ‌స్తోంది. అవును, ఈ సినిమాను మొద‌ట జనవరి 13న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, అనూహ్యంగా ఈ సినిమాను జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. దీంతో పొంగల్ రిలీజ్ లలో అజిత్ అంద‌రి కంటే ముందుగా దిగుతున్నాడు. ఇది సినిమాకు బాగా క‌లిసొచ్చే అంశం. జ‌న‌వ‌రి 11న రావ‌డం వ‌ల్ల అజిత్ సినిమాకు ఒకరోజు ఫ్రీ రన్ దొరుకుతుంది. ఏదేమైనా అజిత్ నుంచి ఈ ట్విస్ట్ అస్స‌లు ఊహించ‌లేద‌నే చెప్పాలి.