తమిళ డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్ తెలుగు,తమిళ, హిందీ భాషలలో కూడా ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలను తెరకెక్కించారు. అయితే మురగదాస్, విజయ్ తో కలిసి కత్తి సినిమాని తెరకెక్కించిన తర్వాత పెద్దగా క్రేజ్ ని సంపాదించలేదు. బాలీవుడ్ లో సోనాక్షి సిన్హాతో అకిరా, మహేష్ బాబుతో స్పైడర్, విజయ్ తో సర్కార్, రజనీకాంత్ తో దర్బార్ వంటి సినిమాలు తెరకెక్కించిన పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. దీంతో ఒక్కసారిగా మురుగదాస్ ఫ్లాపుల్లో మునిగిపోయారు. ఈ డైరెక్టర్ తో సినిమా చేయడానికి పెద్దగా ఏ హీరోలు కూడా ఆసక్తి చూపించడం లేదు.ఈ నేపథ్యంలోని మురగదాస్ ఒక సైన్స్ ఫిక్షన్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.
రామ్ చరణ్ ఈ ప్రాజెక్టును తెరపైకి తీసుకురావాలని రీసెంట్గా తనకు చెప్పినట్లుగా తెలుస్తోంది. తమిళంలో ఈ చిత్ర కథని శింబుతో.. తెలుగులో మాత్రం రామ్ చరణ్ తో చేయాలనుకుంటున్నారట. కానీ అలా చేయడానికి చరణ్ పెద్దగా ఆసక్తిలేరనే వార్తలు వినిపిస్తున్నాయి. మురగదాస్ అదే స్టోరీని అల్లు అర్జున్ కు వినిపించగా తెలుగులో మాత్రమే తనతో చేస్తానని తమిళంలో మాత్రం శింబుతో చేస్తానని చెప్పారట.అయితే బన్నీ కూడా చరణ్ తరహాలోనే మురుగుదాసు డీల్ ని రిజెక్ట్ చేసినట్లుగా సమాచారం. ఏదైనా కొత్త కథ ఉంటే చెప్పండి పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేద్దామని చెప్పారట.
RRR చిత్రంతో పాన్ ఇండియా జాబితాలో చేరిన రామ్ చరణ్ ఆ క్రేజ్ కు తగ్గట్టుగా తన తదుపరి ప్రాజెక్టులను పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తున్నారు.అల్లు అర్జున్ కూడా పుష్ప చిత్రంతో పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించారు. కానీ మురగదాస్ మాత్రం ఓకే కథని తెలుగులో ఒక హీరోతో తమిళ్ లో ఒక హీరోతో ఒకే కథని చేయాలనుకోవడంతో అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. దీంతో బన్నీ, రామ్ చరణ్ హీరోలు పాన్ ఇండియా హీరోలు కాదా అంటూ అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు.