ప్రస్తుతం 2022 చివరి నెలలోకి అడుగు పెట్టేశాం. కాగా సినీ ప్రేమికులందరి కోసం ఈవారం ఏకంగా 15కు పైగా సినిమాలను డిసెంబర్ 9న విడుదల చేయనునట్లుగా చిత్ర బృందాలు ప్రకటించాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.
థియేటర్స్‌లో రిలీజ్ అవుతున్న సినిమాలు
• డిసెంబర్ 9న పంచతంత్రం సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
• సత్యదేవ్, తమన్నా హీరో హీరోయిన్లుగా చేసిన గుర్తుందా శీతాకాలం కూడా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కన్నడలో సూపర్‌హిట్ అయిన ‘లవ్ మాక్‌టైల్ రీమేక్.
• ముఖచిత్రం, అలానే మేఘా ఆకాష్ ప్రేమ సందేశం మూవీలు కూడా ఈ నెల 9న థియేటర్స్‌లోకి రానుంది.
• చెప్పాలని ఉంది మూవీ డిసెంబర్ 9న రిలీజ్ అవుతుంది.
• రంజిత్, సౌమ్య మినన్ హీరో హీరోయిన్లుగా లెహరాయి మూవీ ఈ నెల 9న థియేటర్స్‌లోకి రానుంది.
• నమస్తే సేట్ జీ సినిమా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో స్వప్న చౌదరి, మోన, రేఖ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
• రాజయోగం సినిమా డిసెంబర్ 9న విడుదల కానుంది. ఇందులో సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్స్‌గా యాక్ట్ చేశారు.
• డేంజరస్ మూవీ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాకి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించాడు.
* విజయానంద్ సినిమా ఈ నెల 9 న థియేటర్స్ లో విడుదల కాభోతుంది. ఈ చిత్రానికి రిషికా శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. దేశం లోనే అతిపెద్ద లాజిస్టిక్ కంపెనీ లోఒకటైన విఆర్ఎల్ వ్యవస్థాపకుడు శంకేశ్వర్ బయోపిక్ పిక్ చిత్రం ‘విజయానంద్’.
ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు
• నజర్ అందాజ్ సినిమా అమెజాన్ ప్రైమ్ డిసెంబర్ 4న హిందీలో రిలీజ్ అయింది.
• మూవింగ్ విత్ మలైకా వెబ్‌సిరీస్ డిసెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది.
• హాలీవుడ్ మూవీ సెబాస్టియన్ మానిస్కాల్కొ డిసెంబర్ 6 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజైంది.
• కనెక్ట్ అనే కొరియన్ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కానుంది.
• ది ఎలిఫెంట్ విస్పరర్స్ :- ఈ తమిళ్ సినిమా డిసెంబర్ 8 న అమెజాన్ ప్రైమ్ లో వస్తుంది.
• ఫాల్ అనే తమిళ్ సినిమా డిసెంబర్ 9 నుంచి అమెజాన్ ప్రైమ్ ప్రసారం కానుంది.
• ఊర్వశివో రాక్షసివో తెలుగు సినిమా డిస్నీ + హాట్‌స్టార్, ఆహా లో డిసెంబర్ 9న వస్తుంది.
• మనీ హైస్ట్ : కొరియ జాయింట్ ఎకనామిక ఏరియా రెండవ వెబ్‌సిరీస్ డిసెంబర్ 9న అమెజాన్ ప్రైమ్ లో రాబోతుంది.
• క్యాట్ అనే హిందీ వెబ్ సిరీస్ డిసెంబర్ 9 న అమెజాన్ ప్రైమ్ లో రాబోతుంది.
• విట్నెస్ (తమిళ చిత్రం) డిసెంబర్ 9న నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతుంది.
• హిందీ వెబ్‌సిరీస్ ఫాదు డిసెంబర్ 9న అమెజాన్ ప్రైమ్‌లో రాబోతుంది.
• మలయాళ సినిమా రామ్ డిసెంబర్ 9న అమెజాన్ ప్రైమ్‌లో రాబోతుంది.
• లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ మూవీ డిసెంబర్ 9న అమెజాన్ ప్రైమ్ వీడియోలో వస్తుంది.
• మాన్ సూన్ రాగా డిసెంబర్ 9 న సోనీ లివ్‌లో వస్తుంది.
• మాచర్ల నియోజకవర్గం మూవీ అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో డిసెంబర్ 9న విడుదల వస్తుంది.
• బ్లర్ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో డిసెంబర్ 9న విడుదలకానుంది.
• హాలీవుడ్ సినిమా బ్లాక్ ఆడమ్ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో, జీ5లో డిసెంబర్ 10 రిలీజ్ అవుతుంది.